Home రంగారెడ్డి పీఠాలు కదిలేనా?

పీఠాలు కదిలేనా?

The authorities have changed the Jafdee office for a number of years

అంతా ఇష్టారాజ్యం
జడ్పీలో ఏళ్ల తరబడి ఒకే చోట తిష్ట
ఎంపిడిఓల బదిలీలకు వేళాయే
శివార్ల కోసం పైరవీలు షురూ

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ బదిలీలను పారదర్శకంగా నిర్వహించడానికి ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతున్న ఎళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసిన కొంత అధికారులు తమ పీఠాలను కాపాడుకోవడానికి అప్పుడే పైరవీలు షురూ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంతో పలు విభాగాల్లో పనిచేస్తున్న చాలా మంది సిబ్బంది ఎళ్ల తరబడి జడ్పీ కార్యాలయంను తమ పీఠాలుగా మార్చుకున్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పాతిక సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్న అధికారులు ఉన్నారంటే రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం పరిస్థీతి ఎలా తయారయిందో అర్ధం చేసుకోవచ్చు. ఎళ్ల తరబడి ఇక్కడే పనిచేస్తున్న చాలా మంది అధికారులు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల మాటలను సైతం పట్టించుకోవడం లేదని కార్యాలయం అంతా వారి ఇష్టారాజ్యంగా తయారు చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కోట్లాధి రూపాయల నిధులతో జిల్లాలో చేపడుతున్న అభివృద్ది పనులలో జిల్లా పరిషత్ అధికారులు చాలా కీలకంగా వ్యవహరించవలసి ఉంటుంది. అభివృద్ది పనుల విషయంతో పాటు నిధులు మంజూరైన పనులకు ప్రొసిడింగ్స్ వంటి అనేక కీలక పనులు చక్కదిద్దవలసిన చాలా మంది ఇక్కడ అంతా చేతి వాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జడ్పీ అద్వర్యంలో నిర్మిస్తున్న భవనాలతో పాటు అన్ని రకాల పనులకు సంబందించి ఇక్కడ నుంచే వ్యవహరం సాగుతుంది. జడ్పీ స్కూల్‌లు, పంచాయతీ రాజ్, యంఆర్‌ఆర్, ఆర్‌డబ్యూయస్, పరిపాలన విభాగం వంటి అనేక కీలకమైన విభాగాల్లో చాలా మంది అధికారులు, సిబ్బంది సంవత్సరాల తరబడి పాతుకుపోవడంతో జిల్లాలోని చాలా మంది కాంట్రాక్టర్‌లు వారిని కుషి చేసి తమ పనులు తాము కానిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. జడ్పీలో అధికారులు పాతుకుపోవడానికి ప్రమోషన్‌లు సైతం సకాలంలో అందక పోవడం కారణమైన చాలా మంది ఇక్కడ నుంచి బయటకు పోకుండా అన్ని రకాల ప్రయత్నాలు, పైరవీలు చేసుకుంటున్నారని తెలిసింది. జిల్లా పరిషత్‌లోనే ఒక శాఖ నుంచి మరోక శాఖకు బదిలీ చేయించుకోవడానికి చాలా మంది అధికారులు, సిబ్బంది తమ ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. జిల్లా పరిషత్‌ను ఇప్పుడైన ప్రక్షాళన చేస్తారా…లేక పీఠాధిపతులకు అప్పగిస్తారో జడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు పెద్దలకు తెలియాలి.

ఎంపిడిఓల పైరవీలు షురూ…
ఎళ్ల తరబడి ఒకే దగ్గర పాతుకుపోయిన ఎంపిడిఓల బదిలీలకు సమయం ముంచుకోస్తుంది. జూన్ 15 వరకు ప్రభుత్వం బదిలీలపై నిషేదం ఎత్తివేయడంతో పాటు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి క్రిష్ణారావు సైతం ఎంపిడిఓల బదిలీలు ప్రక్రియను నిర్వహించాలని ఆసక్తీ ఉండటంతో చాలా మంది ఎంపిడిఓల కుర్చిలు కదలనున్నాయి. జిల్లాలోని శివారులోని చాలా మంది ఎంపిడిఓలు ఐదు సంవత్సరాలకు పైగా ఒకే చోట పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. పది మంది ఎంపిడిఓలు ఐదు సంవత్సరాలుగా ఒకే చోట పనిచేసున్నారు. బదిలీలు తప్పనిసరి అయిన పక్షంలో శివారులోనే పోస్టింగ్‌లు సంపాధించుకోవాలని చాలా మంది అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంబించినట్లు తెలిసింది. తెలంగాణ లోని వివిధ జిల్లాల నుంచి నేరుగా రంగారెడ్డి జిల్లాలోని శివారులో పోస్టింగ్ సంపాధించుకోవడం వెనక చాలా పెద్ద పైరవీలు ఉంటాయి. రంగారెడ్డి జిల్లాలో ఒకరిని మించిన మరోకరు ఉండటంతో పైరవీలు చాలా పెద్ద స్థాయిలో జరుగనున్నాయని శివారు పోస్టింగ్‌లకు మంచి డిమాండ్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం బదిలీలు చోటుచేసుకుని వికారాబాద్ జిల్లాలో పోస్టింగ్‌లు దక్కితే మరో సంవత్సరం వికారాబాద్ జిల్లాలో కొత్త జిల్లా పరిషత్ ఏర్పడిన పక్షంలో వారు అక్కడే ఫిక్స్ అయ్యే అవకాశం ఉండటంతో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని శివారు మండలాల పోస్టింగ్‌లు దక్కించుకోవడానికి చాలా మంది అడ్డదారులు తొక్కడానికి సిద్దమవుతున్నారు.