Home దునియా శీతాకాల సౌందర్యం

శీతాకాల సౌందర్యం

Winter Season

 

సాధారణంగా చాలామందికి అన్ని కాలాల్లో కెల్లా శీతాకాలం అంటే ఇష్టపడతారు. ఎందుకంటే ఉదయం మరి కొద్దిసేపు ఎంచక్కా వెచ్చగా పడుకోవచ్చనుకుంటారు. మరి వాతావరణం చల్లగా ఉంటే అలాగే ఎంతసేపైనా పడుకోవాలనిపిస్తుంది. ఈ శీతాకాలంలో చాలామందికి జలుబు, దగ్గు, చేతులు, పాదాలు, పెదాలు, శిరోజాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి. అవేంటో చూద్దాం…

జలుబు నుంచి ఉపశమనం పొందేందుకు..
* వేడిపాలల్లో చిటికెడు పసుపు వేసుకుని రాత్రి పడుకొనే ముందు తాగితే బాగా ఉపయోగపడుతుంది.
* రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క.. దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడగట్టి దీనికి కొద్దిగా తేనెను కలిపి తాగితే మంచిది. ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
* పాలల్లో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకుని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఏడు- ఎనిమిది మిరియాలు నెయ్యిలో వేయించుకుని తినాలి.

* గోరు వెచ్చని పాలను తాగాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది.
* తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలో కలుపుకోవాలి.
చర్మ సంరక్షణ :
* చర్మాన్ని మృదువుగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం మాయిశ్చరైజర్లు వాడాలి.
* సబ్బుకన్నా సున్నిపిండి బాగా పనిచేస్తుంది.
* గోరువెచ్చని నీటిలో ఒక స్పూను కొబ్బరినూనె వేసుకుని స్నానం చేయాలి.
* రాత్రి పడుకునేముందు కాళ్లు, చేతులకు క్రీము రాసుకుని పడుకోవాలి. లేదంటే కొబ్బరినూనె రాయాలి.
* ఫేస్‌ప్యాక్‌లు ముఖాన్ని మరింత పొడిగా మారుస్తాయి. అందుకని ఫేస్‌ప్యాక్‌లు పళ్ల మిశ్రమం వంటివైతే బెటర్.
* పగిలే పెదాలని నాలుకతో తడిపి పదేపదే తడి చేసుకోవద్దు. పెదాలు పగలకుండా లిప్‌బామ్, విటమిన్ ఇ ఆయిల్ అప్లై చేయాలి. పాదాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
* చర్మ సమస్యలు ఎదురైతే వైద్యుని సంప్రదించాలి.

జుట్టుకు మరింత శ్రద్ధ అవసరం :
జుట్టు పొడిబారడం, చిట్లటం, చుండ్రువంటివి రాకుండా జాగ్రత్త పడాలి. హెయిర్ డ్రైయ్యర్ వాడితే జుట్టు మరింత పొడిబారి ఊడిపోతుంది.

ఆహారం :
చలికాలంలో ఆహారం వేడిగా తినడం చాలా అవసరం. అలా చేస్తే శక్తిని పునరుద్ధరించినట్లే! ముఖ్యంగా సూప్‌లు వంటివి శరీరానికి సత్తువనిస్తాయి. చలికాలంలో పీచు పదార్థాలు, పళ్లు, ఆకుకూరలు, కాయగూరలు బాగా తినాలి. ప్రోటీన్లు గల గింజధాన్యాలు, మాంసం తీసుకోవాలి. సీజనల్ పళ్లు తీసుకోవాలి. ఆయా కాలానికి అనుగుణంగా శరీరానికి ఏం అవసరమో అవన్నీ ఆ పళ్లలో ఉంటాయి. వ్యాధులు దరిచేరకుండా రోగనిరోధకశక్తిని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

బయటి ఆహారం తినడం, బయటి నీళ్లు తాగడం వంటివి చలికాలం అనికాదు, ఏం కాలంలోనూ మంచిదికాదు. చలికాలంలో దాహం వేయదు కదా అని నీళ్లు తాగడం తగ్గించకూడదు. మజ్జిగ, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు వంటి శీతల పానీయాలు తీసుకోవడం తగ్గించాలి.
దుస్తులు : చలిగాలి సోకని మందపాటి దుస్తులు ధరించాలి. దుప్పట్లు, రగ్గులు చలికాలంలో కాచి వడబోసిన నీళ్ళను తాగడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

పరిశుభ్రత : శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. స్వెట్టర్లు, రగ్గులు ఎండలో వేస్తుండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలం నుంచి బయట పడొచ్చు.

The Beauty of Winter Season