Sunday, March 26, 2023

కాంగ్రెస్‌తోనే బహుజన తెలంగాణ

- Advertisement -

cong2

మనతెలంగాణ/యాదాద్రి ః తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తమ బతుకులు మారుతాయని ఎదురు చూసిన నాలుగున్నర కోట్ల ప్రజలకు కేసిఆర్ పాలన నిరాశ మిగిల్చిందని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌తోనే బహుజన తెలంగాణ ఏర్పడుతుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమ య్యగౌడ్ అన్నారు. శనివారం మండలంలోని సాధువెల్లి గ్రామంలో కాంగ్రేస్ ఆధ్వర్యంలో చేపట్టిన గడపగడపకి కాంగ్రేస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పేద ప్రజల బతుకులు బాగు పడుతాయని ప్రాణ త్యాగాలు సైతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజా ఆకాంక్షలు కూడు, గుడ్డ, నీడ, ఉపాధి అందలేదని ప్రభుత్వ తీరుని విమర్శించారు. నాలుగున్నర సంవత్సర కేసిఆర్ పాలనలో రైతులకు నిరుద్యోగులకు తమ కష్టాలు తీరేనా అని ఎదురు చూపులే తప్ప ప్రభుత్వం చేసింది ఏమి లేదని, కనీసం పేద ప్రజలకు రేషన్ కార్డును కూడా ఇవ్వకుండా నిత్యవసర వస్తువులైన కిరోసిన్, చక్కెర, గోధుమలు, పప్పులు ప్రజలకు అందించడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేద ప్రజల బతుకులు బాగుపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య, గుండ్లపల్లి భరత్, మల్లెశం, పెల్లి మెల్లి శ్రీధర్, కానుగు బాలరాజు, గుజ్జ శ్రీను, సాదువెల్లి గ్రామ శాఖ నాకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News