Home భద్రాద్రి కొత్తగూడెం ప్రాజెక్టు పనుల గుంతలో పడి ఇద్దరు మృతి

ప్రాజెక్టు పనుల గుంతలో పడి ఇద్దరు మృతి

The catastrophe is in danger of coming home

గేదెలను ఇంటికి తోలుకువచ్చే క్రమంలో ప్రమాదం

మనతెలంగాణ/బూర్గంపాడు: సీతారామ ప్రాజెక్టు పనుల కోసం తీసిన గుంతలో పడి మోరంపల్లిబంజర్ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్ధానికులు,పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్లితే సీతారామ  ప్రాజెక్టు పనులో భాగంగా మండల పరిధిలోని జికలగూడెం గ్రామ సమీపంలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు  కల్వా పనుల కోసం తీసిన గుంతలో గేదేలు దిగటంతో వాటిని ఇంటికి తోలుకు వచ్చే క్రమంలో గేదేలను గోతిలో నుంచి బయటికి పంపిచేందుకు గోతిలో ముందుగా జోగుల సుధీర్ గుంతలో దిగి గేదేలను బయటికి గద్దించే క్రమంలో గుంతలోకి దిగాడు,గుంతలో నీరు వుండటంతో  ప్రమాదవశాత్తు గుంతలో పడి మునిగి పోయాడు,ఇది అంత చూస్తున్న గంటా భార్గవ్  తన బావ గోతిలో దిగి మునిగి పోవడంతో వెంటనే తనను రక్షించే క్రమంలో గంటా భార్గవ్  సైతం గోతిలోకి దిగాడు ఈ క్రమంలో గోతిలో  ఇద్దరు చిన్నారులు జోగుల సుధీర్(18),గంటా భార్గవ్(9)లు మృతి చెందారు.రెండవ శనివారం స్కూల్‌లు,కాలేజిలకు సెలవు దినం  కావడంతో ఇద్దరు బావబామ్మర్ధులు గేదలను ఇంటికి తోలుకు వచ్చేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తు ఈ  ప్రమాదానికి గురి అయిన్నారు.మృతి చెందిన గంటా భార్గవ్ స్ధానిక మోరంపల్లిబంజర్ గ్రామంలోని నూస్కాలర్ స్కూల్‌లో 5వ తరగతి చదువులున్నాడు.జోగుల సుధీర్ పాల్వంచ లోని రవి ఐటిఐ లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.మృతి చెందిన జోగుల సుధీర్ కృష్ణ జిల్లా నూజివీడు మండలంలోని రమణక్కపేట గ్రామానికి చెందిన వాడు,గత కొన్ని సంవత్సరాలుగా మోరంపల్లిబంజర్‌లో గల తన తాతయ్య వాళ్ల ఇంట్లో వుంటు చదువుతున్నాడు.ఓకే కుటుంబాని చెందిన చిన్నారులు కావడంతో ఒక్కసారిగా మోరంపల్లిబంజర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి.ఈ సమాచారం  స్ధానికుల ద్వార  తెలుకున్న బూర్గంపాడు ఎస్‌ఐ సంఘటన స్ధలానికి చోరుకుని వివరాలను సేకరించారు.