Home రాష్ట్ర వార్తలు సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్‌చల్

సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్‌చల్

TOWER

మన తెలంగాణ/ గన్నేరువరం : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన పాశం సంతోష్ తండ్రి కనకయ్య తమకు వంశ పారపర్యంగా వస్తున్న 313/ఎ సర్వే నెంబర్‌లోని ఆరు గుంటల స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ భూమిలో పాశం బాలయ్య, సందవేని రా ములు, సందవేని తిరుమల్, సందవేని మల్లేష్, సందవేని తిరుపతి, సందవేని పర్శరాములు కలిసి అక్రమ నిర్మాణం చేపడుతుండగా అడ్డువెళ్తే దౌర్జన్యంగా ఆ స్థలంలో టెంట్ వేసి పూరి పాక ఏర్పాటు చేశారు. ఈ భూమిపై సర్వహక్కులు తనకే ఉన్నట్లుగా గతంలో కోర్టు నుంచి కూడా ఉత్తర్వులుజారీ అయ్యాయని, కోర్టు ఉత్తర్వుల్ని కూడా ధిక్కరిస్తూ, రాజకీయ ప్రోత్బలంతో తమ భూమిని ఖబ్జ్జా చేస్తున్నారని పాశం సంతోష్ ఎస్‌ఐ వంశీకృష్ణకి ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేక పోవడంతో శుక్రవారం ఉదయం భూ సమస్య పరిష్కారించాలని సంతోష్ సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేస్తుంగా. అక్కడికి చేరుకున్న స్థానిక ఎస్‌ఐ బి.వంశీకృష్ణ, నయాబ్ తహసీల్దార్ సయ్యద్ క్రమొద్దీన్‌లు వచ్చి ఫోన్‌లో సంభాశించి బాధితునికి స్పష్టమైన హామీ ఇవ్వడంతో అతను టవర్ దిగడంతో అధికారులు ఊపిరిపిల్చుకున్నారు.