Home భద్రాద్రి కొత్తగూడెం దేశానికే ఆదర్శం మన తెలంగాణ

దేశానికే ఆదర్శం మన తెలంగాణ

The country is the dream of our Telangana

ప్రజల భాగస్వామ్యంతోనే ఇంతటి అభివృద్ధి
భౌగోళికంగా విడిపోయినా తెలుగు వారంతా ఒక్కటే
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

మన తెలంగాణ/భద్రాచలం : అభివృద్ధి సం క్షేమ పథకాల అమలుల్లో ఎవరి ఊహలకు అందని విధంగా దూసుకుపోతున్న మన తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖామాత్యులు కడియం శ్రీహరి అన్నారు. స్థానిక కేకే ఫంక్షన్ హాల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ రాజకీయ శిక్షణ తరగతులకు రెండో రోజైన సోమవారం ఆయన ముఖ్యాతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్రం ఎవరి ఊహలకు అం దని విధంగా అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ముందుకు దూసుకుపోతోందని, రూ.40 వేల కోట్లతో 40 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి గడించిందని, మత సామరస్యానికి ప్రతీకగా క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి వంటి పడుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతు పక్షపాతిగా నిలిచారని, ఏటా రైతుకు ఎకరాకు రూ.8 వేల చొప్పున అందించడం గర్వకారణమని, ఇది సువర్ణాక్షరాల్లో లిఖించే అంశం అన్నారు. అంతే కాకుండా మిషన్ భగీరథ, కాకతీయ వంటి పథకాలు చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని, లళ్యాణ లక్ష్మీ. షాదీముబారక్ పథకాలు పేదింటిలో పెళ్లి భాజాలు మోగించిందని చెప్పారు. ఆడ పిల్లలు ఉన్న కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో బాధలు పడాల్సిన పనిలేదన్నారు. ప్రతీ ఎకరాను సస్యశ్యామలం చేసేందుకు ఈ జిల్లాలో భక్తరామదాసు, సీతారామ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని, బిటిపిఎస్ ద్వారా ఈ ప్రాంతంలో చరిత్రలోనే నిలిపోనుందని చెప్పారు. కేసిఆర్ కిట్ అందించడం ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు సంఖ్య పెరిగిందని, ప్రభుత్వ భరోసాతో పేదలు ప్రభుత్వ ఆస్పత్రుల బాటపట్టారని చెప్పారు. అన్ని రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, ఆరోగ్య తెలంగాణనే ప్రభుత్వ ధేయం అన్నారు. అన్ని వర్గాల వారిని అభివృద్ధి పథంలో నిడిపించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆర్థిక భారానికి కూడా వెరవకుండా సంక్షేమ పథకాల రూపకల్పనతో పాటు అమలు జరుగుతోందని, ప్రభుత్వ చేయూతను సద్వినియోగం చేసుకుని ఆర్థికంబా బలోపేతం కావాలని సూచించారు. భౌగోళికంగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలంతా ఒక్కటే అని, అంతా సుఖ సంతోషాలతో ఉండాలని రామున్ని ప్రార్థించినట్లు తెలిపారు. భద్రాచలం వేదికగా పాలేరు నియోజకవర్గ కార్యకర్తలకు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించడం గర్వకారణం అని, ఈ శిక్షణా తరగతులు రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ శిక్షణా తరగతుల ద్వారా కర్యకర్తలు క్రమశిక్షణను మరింతగా అలవర్చుకోవాలని, టిఆర్‌ఎస్ కార్యకర్తలు అంటే క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలని ఆకాంక్షించారు. నిత్యం నేర్చుకోవడం ద్వారా అనేక అంశాల బోధపడతాయని, ఈ శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న అంశాలను ప్రజా సేవకు మలచాలని, తద్వారా మీమీ ప్రాంతాల్లో చక్కటి కార్యకర్తలుగా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులున్నారు.
ముగిసిన రాజకీయ శిక్షణా తరగుతులు
భద్రాచలం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతులు సోమవారం నాటితో ముగిశాయి. పాలేరు నియోజకవర్గానికి చెందిన కొందరు కార్యకర్తలకు మాత్రమే తొలిదఫా శిక్షణ ఇచ్చామని, మిగిలినవారికి కూడా త్వరలో మరో ప్రాంతంలో శిక్షణ తరగుతులు ఏర్పాటు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. రెండు రోజుల పాటు శిక్షణ హాజరైన వారితో పాటు ముఖ్యాతిధులుకా ఎలాంటి లోటుపాట్లు లేకుండా భద్రాచలం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చక్కటి ఆతిధ్యాన్ని అందజేశారని, తొలిసారిగా టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయశిక్షణా తరగుతులు రాముని పాదాల చెంత జరగడం గర్వకారణంగా ఉందని కార్యకర్తలు అనందాన్ని వ్యక్తం చేశారు.