Friday, March 31, 2023

యాదాద్రిలో భక్తుల రద్దీ

- Advertisement -

public

*మేడారం నుంచి యాదాద్రికి భక్తుల రాక
*13.58 లక్షలు స్వామి వారి ఆదాయం: ఆలయ కార్యనిర్వాహణ అధికారి

మనతెలంగాణ/యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్థం తరలివస్తున్న భక్తులతో యాదాద్రి క్షే త్రం రద్దీగా మారింది. సమ్మక్క సారలమ్మ జాతరలకు వెళ్లిన భక్తులు యాదాద్రి నరసింహుని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. రెండు రోజులుగా స్వామి వారి దర్శనార్ధం తరలి వస్తున్న భక్తుల రద్దీ పెరిగింది. శనివారం రోజున శ్రీ స్వామివారి దర్శనానికి తరలి వస్తున్న భక్తులు అధిక సంఖ్యలో రావడంతో యాదాద్రి కొండపైన, పట్టణంలో భక్తులతో కిటకిటలాడింది. పట్టణంలోని తులసి కాటేజీ, గోశాల, చెక్‌పోస్టు తదితర ప్రాంతాల్లో భక్తుల సందడి అధికంగా కనబడింది. శ్రీ స్వామి వారి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉదయం నుండే స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారిని కూడా దర్శించుకొని పూజలు నిర్వహించారు.
శ్రీవారి నిత్యరాబడి
శ్రీలక్ష్మినరసింహా స్వామివారి దేవస్థానం స్వామివారి నిత్యరాబడిలో భాగంగా శనివారం రోజున 13లక్షల 58వేల 931రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కా ర్యనిర్వాహణ అధికారి తెలిపారు. ప్రధాన బుకింగ్, శ్రీఘ్రదర్శనం, వ్రతా లు, కల్యాణ కట్ట, ఎంక్వైరీ, ప్రసాదాలు, వాహన పూజల ద్వారా శాఖల వారిగా ఆదా యం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News