- Advertisement -
మన తెలంగాణ/కీసరః చీర్యాల్ నాట్‌కన్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. శ్రీలక్ష్మీ నరసింహ్మ స్వామి దేవస్థానం సమీపంలోని నాట్‌కన్ చెరువులో మహిళ మృతదేహం తేలియాడుతుండటం గమనించిన స్థానికులు కీసర పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్టుమార్టం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని మహిళ మృతదేహంగా పేర్కొన్న పోలీసులు మృతురాలు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటుందని, ఆకుపచ్చ రంగు చీర, జాకెట్ దరించి ఉందని అన్నారు. కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -