Home తాజా వార్తలు 5 లోగా ప్రిన్సిపల్ పోస్టుల దరఖాస్తు హార్డ్ కాపీని సమర్పించాలి

5 లోగా ప్రిన్సిపల్ పోస్టుల దరఖాస్తు హార్డ్ కాపీని సమర్పించాలి

The deadline for submission of principal applications is June 5

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల్లో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారం హార్డ్ కాపీతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జూన్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్‌లో అందజేయాలని రాష్ట్ర గురుకుల నియామక బోర్డు ఛైర్మన్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు స్వయంగా గానీ లేదా రిజిష్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు ఫారం, టెస్టిమోనియల్స్‌ను అందజేయాలని తెలిపారు.