Thursday, April 25, 2024

రెండున్నర నిమిషాలకో మరణం

- Advertisement -
- Advertisement -

us

 

న్యూయార్క్‌లో దయనీయ పరిస్థితులు
వెంటిలేటర్లు, మాస్క్‌లకూ తీవ్ర కొరత
అమెరికాలో ఒక్క రోజే 1480 మంది మృతి

న్యూయార్క్: అగ్రరాజ్యమైన అమెరికాలో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చింది. శుక్రవారం ఒక్క రోజే ఆ దేశంలో రికార్డు స్థాయిలో 1480 మంది చనిపోయినట్లు జాన్ హాప్‌కిన్స్ ట్రాకర్ వెల్లడించింది. గురువారం రాత్రి 8.30 గంటలనుంచి శుక్రవారం రాత్రి అదే సమ యం వరకు 1480 మంది మరణించినట్లు గుర్తించింది. దీంతో అమెరికాలో మరణాల సంఖ్య 7000ను దాటిపోయింది. దీన్ని బట్టి అమెరికాలో వైరస్ తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ మహమ్మారికి కేంద్రంగా మారిన న్యూయార్క్ రాష్ట్రంలో దాదాపు ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రంలో 562 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్షను దాటిందని, ఏప్రిల్ 2-3 మధ్య ఒక్క రోజులోనే అత్యధిక మరణాలు నమోదైనాయని రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో చెప్పారు.

శుక్రవారం మరణాలతో కలుపుకొని రాష్ట్రంలో మరణాల సంఖ్య 2,935కు చేరుకున్నట్లు కూడా ఆయన చెప్పారు. కాగా రాష్ట్రంలో కరో నా పాజిటివ్ కేసులు 1,02, 863కు చేరుకున్నాయి. అంటే మొత్తం అమెరికాలో గుర్తించిన కరోనా కేసుల్లో సగం కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదైనాయి. మార్చి నెల తొలి 27 రోజులకన్నా గత 24 గంటల్లోనే ఎక్కువ మంది చనిపోయారని, గత మూడు రోజుల్లో రాష్ట్రంలో మరణాల సంఖ్య రెట్టింపు అయిందని క్యూమో తెలిపారు. రాష్ట్రంలో వెంటిలేటర్ల కొరత ఎక్కువగా ఉందని, ఆరు రోజులకు సరిపడా వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లోను సరిపడా వెంటిలేటర్లను అందించే స్థితిలో రాష్ట్రం ఉందని తాను అనుకోవడం లేదని ఆయన చెప్పారు. అయినప్పటికీ అవసరమైన వెంటిలేటర్లను సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే వైద్య సిబ్బందికి అవపరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలుచ మాస్కులు, గ్లౌజ్‌ల కొరత కూడా బాగా ఉందన్నారు.

మాస్కులు ధరించాలి: ట్రంప్
ప్రజలందరూ మాస్కులు ధరించాలని, అది కూడా ఇళ్లలో తయారైన సాధారణ మాస్కులనే దరించాలని శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. మెడికల్ మాస్కులు, ఎన్95 మాస్కులు ధరించరాదని సూచించారు. అత్యవసర విభాగాల్లో పని చేసే వారికి వైద్య సిబ్బందికి అవి ఉపయోగపడతాయన్నారు. అలాగే మాస్కులు ధరించినంతమాత్రాన సామాజిక దూరం పాటించకుండా ఉండడం, ఇళ్లలోంచి బైటికి రావడం లాంటివి చేయరాదని హెచ్చరించారు. కాగా తాను మాత్రం మాస్క్ ధరించనని ట్రంప్ చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ కరోనా చికిత్సలో బాగా పని చేస్తోందని ట్రంప్ చెప్పారు. కరోనా నియంత్రణ, చికిత్సలో ఇతర డ్రగ్సతో పాటుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై కూడా పరిశోధనలు జరుపుతామని ఆయన తెలిపారు.

60,000 దాటిన మరణాలు
ఇదిలా ఉంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 60 వేలను దాటిపోయింది. మొత్తం 60,457 మంది చనిపోగా, వీరిలో ఐరోపాలో చనిపోయిన వారు 44,132 మంది ఉన్నట్లు ఎఎఫ్‌పి వార్తాసంస్థ రూపొందించిన తాజా గణాంకాలు వెల్లడించాయి. 14,681 మరణాలతో ఇటలీ ప్రథమ స్థానం లో ఉండగా, స్పెయిన్ (11,744), అమెరికా (7,159), ఫ్రాన్స్ (6,507), బ్రిటన్ (4,313) వరసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా, కెనడాలు కలిపి 2,90, 219 కరోనా కేసులు వెలుగు చూడగా 7,325 మంది చనిపోయారు, ఆసియాలో 1,15,777 కేసులకు గాను 4,124 మంది మృతి చెందారు.

 

The death toll in the US exceeds 7000
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News