Home కుమ్రం భీం ఆసిఫాబాద్ అన్ని వర్గాల, కులాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

అన్ని వర్గాల, కులాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

tent

రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న 

మన తెలంగాణ/కౌటాల : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల, కులాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎంఎల్‌సి పురాణం సతీష్, సిర్పూర్ ఎంఎల్‌ఎ కోనేరు కోనప్పతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం, కౌటాల ప్రధాన రోడ్డు పనులను ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక బుద్ధవిహార్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి రామన్న మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులస్థులందరి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందని తెలిపారు. రాష్ట్రంలోనే వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం రూ.వెయ్యికోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్‌సి, ఎస్‌టి, బిసి కార్పొరేషన్ రుణాలను లబ్దిదారులకు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని కుల వృత్తులకు ప్రభుత్వం సహాయం చేస్తుందని తెలిపారు. కుల వృత్తులు సమాజానికి సేవకులుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మే దరి కులస్థులకు వెదురు వస్తువులు తయారు చేయడానికి సబ్సిడీపై వెదురు బొంగులు అందిస్తామని తెలిపారు. రూ. 40వేల కోట్లతో ప్రభుత్వం సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధం గా రాష్ట్ర ప్రభుత్వం రైతులను అభివృద్ధి చేస్తుందని, రూ. 10వేల కోట్ల తో రైతు రుణాలు మాఫీ చేశారన్నా రు. భూ సర్వేతో రైతుల సమస్యలు ప రిష్కారం అవుతాయని, రైతులకు ఎకరానికి రూ. 4వేలు చొప్పున రెండు పంటలకు చెల్లిస్తామన్నారు. మం డల కేంద్రంలో గురు వారం పలు అభి వృద్ది పను లకు మంత్రి జోగురా మన్న, ఎంఎ ల్‌సి పురాణం సతీష్, ఎంఎ ల్‌ఎ కోనేరు కోనప్ప భూమిపూజ చేశారు. కౌటా లలో రూ. 25ల క్షల నిధు లతో గౌడ సంక్షేమ సంఘం భవన నిర్మా ణా నికి, రూ. 25ల క్షల నిధు లతో అంబే డ్కర్ భవనం కమ్యూ నిటీ భవన నిర్మా ణా నికి, రూ. 25ల క్షల నిధు లతో బాబూ జ గ్జీ వ న్‌రాం భవనం నిర్మాణం, ఎస్‌టి కమ్యూ నిటీ భవన నిర్మా ణా నికి భూమిపూజ చేశారు. అలాగే రూ. కోటితో కౌటాల ప్రధాన రోడ్డు పనులు ప్రారం భిం చారు. రూ. కోటితో నిర్మిం చిన కళా శాల భవ నాన్ని ప్రారం భిం చారు. అలాగే కౌటా లలో రూ. 10 లక్ష లతో గ్రంథా లయ భవన నిర్మా ణానికి భూమి పూజ చేశారు. మన్నే వార్ సేవా సంఘం భవనం చుట్టు ప్రహారి గోడ కోసం రూ.10ల క్ష లతో నిర్మా ణా నికి భూమి పూజ చేశారు. దోబిఘాడ్ నిర్మా ణా నికి భూమి పూజ చేశారు. రూ. 5ల క్ష లతో కౌటాల ప్రెస్‌క్లబ్ భవన నిర్మా ణా నికి నిధులు మంజూరు చేస్తా మని ఎంఎ ల్‌సి పురాణం సతీష్ తెలి పారు. ఈ కార్య క్ర మంలో ఎంపిపి డుబ్బుల వెంకన్న, జడ్ పి టిసి డుబ్బుల నానయ్య, మహార్ సంఘం జిల్లా అధ్య క్షుడు బస ర్ కర్‌విశ్వ నాథ్, వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పం చ్‌లు, ఎంపి టి సిలు,ప్రజా ప్రతి ని ధులు పాల్గొ న్నారు. ఈ సంద ర్భంగా కాగ జ్ న గర్ డిఎ స్‌పి సాంబయ్య ఆధ్వర్యంలో పోలీ సులు భారీ బందో బస్తు చేప ట్టారు.