Home నల్లగొండ డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన

డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన

double

 ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో వెంటనే మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సోమవారం సూర్యాపేట జిల్లా, గొల్ల బజార్‌లో   ఇండ్ల నిర్మా ణాల ఎదుట లబ్ధిదా రులు నిరసన తెలిపారు. మన తెలంగాణ/సూర్యాపేట : ప్రభుత్వం లబ్ధిదారులని నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో వెంటనే మౌళిక వసతులు కల్పించాలని కోరుతూ సోమవారం పట్టణంలోని గొల్ల బజార్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల ఎదుట లబ్ధిదారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు విలేకరులతో మాట్లాడారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇండ్లను కేటాయించి 18 రోజులు గడుస్తున్నా నేటికి పట్టాలు అందించలేదన్నారు. ప్రభుత్వం లబ్ధిదారులకు కేవలం డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేసిందే తప్ప కరెంటు సౌకర్యం, నీటి సౌకర్యం కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేసిందనే సంతోషమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న డిప్యూటి తహసీల్దార్ జలీల్, విఆర్‌ఓ నాగేశ్వరరావుకు లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.  ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు చెర్కుపల్లి పద్మ, బొంత సరోజ, రవ్వ రమాదేవి, లక్ష్మీ, ఇల్లెందు సుమలత, రుక్సానా, మైలవరపు శైలేష్, నవాబ్, ఉపేందర్, శ్రీను, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.