Home ఎడిటోరియల్ ఉపాధికి జియస్‌టి చిల్లు

ఉపాధికి జియస్‌టి చిల్లు

GST

జియస్‌టి ప్రపంచంలో మొదటగా ఫ్రాన్స్‌లో ప్రవేశపెట్టారు! ప్రత్యక్ష పరోక్ష పన్నుల విధానాన్ని తీసివేసి, దేశవ్యాపితంగా ఒకే పన్ను విధానాన్ని తీసుకురావాలని ఈ జియస్‌టిని తెచ్చారు. దాదాపుగా 140 దేశాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. భారత ప్రభుత్వం జులై 1, 2017 నుండి ప్రవేశ పెట్టనుంది. కెనడాలో వున్న జియస్‌టి విధానాన్ని మన దేశంలో అమలు చేయబోతున్నారు.

Country GST Table

ఈ విధానం అమెరికాలో లేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, ప్రతి రాష్ట్రానికి సర్వాధి కారాలు ఉంటాయి. మన దేశంలో కేంద్రం ఆధీనంలో అన్ని రాష్ట్రాలు ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేంద్రం పెత్తనంలో రాష్ట్రా లు నలిగిపోతాయి. జియస్‌టి అమలు చేసిన చాలా దేశాలు, తీవ్ర ఆర్థిక సంక్షోభాలకు, ఇబ్బందులకు గురియినట్లు చరిత్ర చెపుతున్నది! జియస్‌టి అమలు చేసిన దేశాలలో, అమలు చేసిన ప్రభుత్వాలు కూలిపోయినట్లుగా కూడా చరిత్ర చెపుతున్నది!

ప్రత్యక్ష, పరోక్ష పన్నులు అంటే, వ్యాట్ (వ్యాట్), సర్వీస్ టాక్స్, ఎక్సైజ్ టాక్సు మొదలై నవి అన్ని కూడా ఈ జియస్‌టిలో కలిసి పోతాయి. వీటిలో రాష్ట్రాలలో విధిస్తున్న టాక్సు లు కూడా, ముఖ్యంగా వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న టోల్ టాక్స్‌లు అన్ని కూడా ఈ పన్ను విధానంలోకి వస్తాయి.
జియస్‌టి వల్ల నిరుద్యోగం పెరిగే అవ కాశం చాలా వుంది. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారు ఉపాధి కోల్పోయే ప్రమాదం, ధరలు పెరిగే అవకాశం, ముఖ్యంగా మందులు దొరకక పోవచ్చు, దొరికినా ధరలు అందు బాటులో వుండకపోవచ్చు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది.

మన దేశ రాజ్యాంగాన్ని 122వ సారి సవ రించి, 2017 సం॥రానికి జియస్‌టి చట్టాన్ని తెచ్చారు. జియస్‌టి అంటే “గూడ్స్ మరియు సర్వీసు టాక్స్‌” తెలుగులో “వస్తు, సేవా పన్ను” అంటారు. ఈ వ్యవస్థను అమెరికాను చూసి, మన దేశంలో పెట్టారనుకొని చాలా మంది పొరపడుతున్నారు. నిజంగా జియస్‌టిని అర్ధంచేసుకొని, అమలు చేసే యంత్రాంగం లేదు! బీడీరంగం, వస్త్ర పరిశ్రమ, గ్రానైట్, చెప్పులు, ఉపాధిహామీ పథకం, టిటిడి ప్రసాదాలు , టైర్లు , తోళ్ళ పరిశ్రమలు, గృహ పరికరాలు, చివరికి అగరు బత్తులను కూడా వదలలేదు. నిల్వవుంచిన కూరగాయల మీద, ఆఖరికి పిల్లలు ఇష్టంగా తినే జాం నూ వదలలేదు!

నిత్యం వాడుకునే బ్లేడులు, టూత్ పేస్టులు, షేవింగ్ క్రీములు, లోషన్ల మీద ట్యాక్సు పెంచారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోవా లంటే చాలా నిత్య అవసరాలను పన్నుల క్రిందకి తెచ్చారు. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు నిరుద్యోగ సమస్యలను తీవ్రంగా ఎదు ర్కొంటున్న ఇప్పటి పరిస్థితులలోపైన పేర్కొన్న పరిశ్రమలు తీవ్ర సంక్షోభానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ పరిశ్రమలు సంక్షోభానికి గురికావడంతో వీటిలో పనిచేస్తున్న కార్మికులను, సిబ్బందిని తగ్గించుకునే ప్రమాదం ముంచుకొస్తున్నది. ఇప్పటికీ చాలా రంగాలు పన్నులు తగ్గించాలని దేశవ్యాపిత ఆందోళనలు చేస్తున్నాయి. పశువధ నిషేధం కారణంగా 2కోట్ల మందికిపైగా ఉపాధి కోల్పోవటంతో నిరుద్యోగం పెరిగే ప్రమాదం ముంచుకొస్తున్నది. అటు విదేశాలు వెళ్ళే అవ కాశాలు తగ్గిపోతున్నాయి. దాదాపుగా పది కోట్ల కుటుంబాలకు తిండి కరవయ్యే ప్రమాదం ఉంది.

రాష్ట్రాలకు నష్టం వస్తే నష్టపరిహారం ఇస్తారుగాని, జియస్‌టి వల్ల సామాన్యుడికి, రైతుకి నష్టం కలిగితే ఎవరు పూడుస్తారు? ప్రస్తుతం వున్న వస్తువుల ధరలలో 5% నుండి 8% పెరుగుదల వుంటుందని, వ్యాపార, వాణిజ్య ఆర్థిక నిపుణుల అంచనా వేస్తున్నారు! టెక్స్‌టైల్ రంగంలో అయితే అనేక రాష్ట్రాలు దెబ్బతింటాయి. తయారయిన మందు లు, వాటి ముడి సరుకులు రెండింటి మీద టాక్సులు విధిస్తారు. మందుల రేట్లు అందు బాటులో లేకుండా పోతాయి. ఆరోగ్య సంరక్షణకు, జివ్‌ు కు వాడే వస్తువుల మీద టాక్సు విధిస్తారు. జిఎస్‌టి వల్ల మరో 2,3 నెలల వరకు అత్యవసర మందుల సరఫరా నిలిచిపోయే ప్రమాద ముందని తెలుస్తున్నది! ప్యాక్ చేసిన వస్తువులపై జియస్‌టి వుంటుంది. ప్యాక్ చేయని వస్తువుల మీద ఉండదు. ప్యాక్ చేయకుండా ఏ వస్తువు లుండవు! ఉదాః పన్నీరును ప్యాక్ చేయకుండా తీసుకోలేము, ఒక వేళ తీసుకుంటే కల్తీవుండే అవకాశం వుంటుంది. అలాగే నూనెలు, ఉప్పు ఇతర నిత్యావసర వస్తువులు, జీవితావసర వస్తువులు జియస్‌టి ద్వారా పెరుగుతాయి. తినే రొట్టె మీద కూడా టాక్సు వేసిన ఘనత బిజెపి ప్రభుత్వానికి దక్కుతుంది.

జియస్‌టి అమలు చేస్తున్న దేశాలలో అది దాదాపుగా 3% నుండి 20 % ఉంటుంది. కాని విచిత్రమేమిటంటే మనదేశంలో మాత్రం 18% నుండి 28% వరకు ఈ టాక్సును అమలు చేయించబోతున్నారు. దేశ ప్రజలు 2,3 సం॥ల వరకు తీవ్ర సమస్యలు ఎదుర్కొవలసి వస్తుంది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా వున్నప్పు డు మన్మోహన్‌సింగ్, పి.వి.నర్సింహా రావు, చిదంబరం, మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా వంటి హేమాహేమీలు, ఎల్‌పిజి (లిబర్‌లైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) ప్రవేశపెట్టి, విద్య, వైద్య రంగాలలో ప్రైవేటీకరణను ఉధృతం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం ద్వారా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కల్పించడం ద్వారా వచ్చే ధనాన్ని సామాన్యుడి సంక్షేమానికి ఖర్చు చేయడం ద్వారా పేదరికాన్ని తగ్గించ వచ్చని, వున్నవారు, లేనివారు మధ్య అంతరం తగ్గించాలని భావించే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం అని చెప్పారు.

పర్మినెంట్ ఉద్యోగాలు లేకుండా 1996 సం॥ నుండి కాంట్రాక్టీకరణ విధానాన్ని అన్ని రంగాలలో ప్రవేశపెట్టారు. కోట్ల కొద్ది ధనం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రవాహంలా వెళ్ళి పోవటంతో వీళ్ళు ఊహించిన సంక్షేమ పథకాలు గంగలో కలిసిపోయి, విదేశాలకు నల్లధనం రూపంలో తరలి వెళ్ళిపోయింది! అవి సామా న్యుడ్ని అందలం ఎక్కించే స్థాయికి ఏనాడు జరగ లేదు, జరగదు! ఈ పెట్టుబడిదారి దోపిడి వ్యవస్థలో. ఎల్‌పిజి మాదిరిగానే ఇప్పుడు జియస్‌టిని తెచ్చారు. దీనివల్ల పన్నులు అధికశాతం కేంద్రా నికి వస్తాయి. ఆ విధంగా పన్నుల విధానాన్ని సరళీకృతం చేయడం ద్వారా ఆదాయం పెరుగు తుందని, పెరిగిన ఆదాయం మొత్తాన్ని దేశ అభివృద్ధిని, సాధిస్తామని అదే పాత పాట ఇప్పుడు పాడుతున్నారు.
ఎన్ని సరళీకృత విధానాలు తెచ్చినా అవి ఎప్పటికీ పనిచేయవు! ఎందుకంటే ఈ వ్యవస్థ (పెట్టుబడిదారీ సమాజం, బూర్జువా, నల్లధనం మింగిన కుబేరులు మరింతగా కుబేరులు అవుతూనే ఉంటారు) ఉన్నంత కాలం ఎట్టి పరిస్థితుల్లో ఈ జియస్‌టి కూడా విఫలమవుతుంది.