Saturday, March 25, 2023

రైతును రాజు చేసేందుకే పెట్టుబడి

- Advertisement -

minister5

*ప్రత్యేక జీవో తెస్తే బ్యాంకులే మేలని రైతుల వ్యాఖ్య
*రైతుల సమన్వయం కోసం కమిటీల ఏర్పాటు
*తెలంగాణకు కోటి ఎకరాలకు నీరందించడమే సిఎం లక్షం
*నాలుగవ విడత రుణమాఫీలో సీఎం సంతృప్తి చెందలేదు
*జిల్లాలోని నిలువరించిన రైతు ముఖాముఖిలో మంత్రి జగదీష్‌రెడ్డి

మన తెలంగాణ/సూర్యాపేటః రైతులు తక్షణ అభివృద్ధి కొరకే గత కొన్ని సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ ప్రయత్నం కొనసాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్తు, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రజలపై చిత్తశుద్ధి, విశ్వాసం ఉంటే సాధించనిదని ఏమీ లేదని ఉద్భోదించారు. రైతులను సంఘటితం చేసేందుకే రైతు సమన్వయ కమిటీలకు ప్రభుత్వం పునాదులు వేసిందని స్పష్టం చేశారు. అందుకు ప్రతి రైతు తన పంట పెట్టుబడికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండకూడదనే సంకల్పంతో ఎకరాకు రూ. నాలుగు వేల చొప్పున రైతుకు అందించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రైతాంగానికి పెట్టుబడిగా ఇచ్చే అట్టి రూపాయలను ఏ విధంగా పంపిణీ చేయాలో ప్రభుత్వం రైతు తీసుకునే నిర్ణయానికే మొగ్గు చూపేందుకు మంగళవారం జిల్లాలోని పెన్‌పహాడ్ మండలం గాజుల మొల్కాపురం గ్రామంలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటి భూ రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 92 లక్షల ఎకరాల సాగు భూమిని ఖరీఫ్‌లో రైతులు సాగు చేస్తున్నట్లు చెప్పారు. రబీలో రైతులు సాగు చేస్తున్న 35 లక్షల ఎకరాల భూమి మాత్రమేనన్నారు. నీరందక, విద్యుత్తు సరిపడక రైతులు విలవిల్లాడినట్లు ఉన్న భూమి సాగుకు పెట్టుబడి లేక వడ్డీదారులను ఆశ్రయించి అప్పుల పాలై చివరకు ఆత్మహత్య చేసుకునే దుస్థితి గత పాలకులు తీసుకువచ్చారని ఆవేదన వ్యక్త పరిచారు. అటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉండేందుకు ముందు చూపుతో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగం దండుగ అని వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఘాటుగా విమర్శించారు. వ్యవసాయం ఏ మాత్రం లాభ సాటిగా లేదని రైతు ఓ నిర్ణయానికి వచ్చే సమయంలో సీఎం చారిత్రాత్మక నిర్ణయంతో రైతులు మరల వ్యవసాయ రంగంపై పునరాలో చించుకుంటున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 51 లక్షల ఎకరాలకు 23 లక్షల 50 వేల మోటార్ల ద్వారా నీరు అందుతుందని వివరించారు. వరుసగా 10 ఏళ్లు కరువు వచ్చినా ప్రజలు మనోవేదనకు గురికాకూడదనే ఆకాంక్షతో మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాకు నీరందించేందుకు సీఎం కృత నిశ్చయంతో ఉన్నట్లు సంకల్పించారు.
రూ. 4 వేలు పోస్టాఫీసుల ద్వారానే జమ చేయాలి
రైతు ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు వెయ్యి మంది రైతులు పోస్టా ఫీసుల ద్వారానే రైతు ఖాతాలో జమ చేయాలని హాజరైన రైతుల్లో ఎక్కువ శాతం మొగ్గు చూపారు. ప్రభుత్వం మరో రకంగా ఆలోచింపజేస్తే బ్యాంకు ఖాతా లకి, రైతులకందించే నాలుగు వేల రూపాయలపై ప్రత్యేక జీఓను తీసుకు రావాలని సూ చించారు. బ్యాంకర్లు రుణమాఫీకి ఎటువంటి సంబంధం లేకుండా అంగీకరిస్తే బ్యా ంకులే మంచిదని కొందరు అభిప్రాయం వ్యక్త పర్చారు. వ్యవసాయ అధికా రు లు, రెవిన్యూ అధికారులు, నేరుగా డబ్బు అందించాలనే వారు తక్కువ శాతం ఉన్నారు.
జిల్లా రైతులకు అందించేది రూ. 260 కోట్లు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా జిల్లా రైతులకు మొత్తం రూ. 260 కోట్లు అందనున్నాయి. జిల్లాలో గతంలో సుమారు ఐదు లక్షలు రైతులు సాగు చేస్తున్నట్లు సర్వేలో ఉండగా ప్రస్తుత భూ సర్వే శుద్దీకరణలో తేలింది ఆరు లక్షల 50 వేలు. ఇందుకు ప్రభుత్వంపై అదనంగా మరో కోటి 20 లక్షలు భారం పడుతుందని కలెక్టర్ సురేంద్రమోహన్ వివరించారు.
మండల వ్యవసాయ అధికారులను సర్వే వివరాలను అడిగిన మంత్రి
మండలంలో సర్వే వివరాలు, రైతులతో ఉన్న సమన్వయాన్ని రైతుల ముందే వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ శుద్ధి కార్యక్రమంలో ఎంత మందికి రైతు పాస్ పుస్తకాలను అందించిన రైతుల వివరాలు అడిగారు. గత రికార్డుల ప్రకారం గ్రామంలో 2631 ఎకరాల భూమి ఉండగా ప్రస్తుతం అది 3,300లకు సాగు భూమిగా తేలిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం వరి, వేరుశెనగ, కూరగాయల సాగుతో పాటు హార్టికల్చర్‌ను కూడా సాగు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
పోస్టాఫీసులోనే రైతు పెట్టుబడి జమ చేయాలి
బ్యాంకుల కంటే పోస్టాఫీసుల ద్వారానే రైతుకి ప్రభుత్వం అందించే పెట్టుబడి త్వరగా అందు తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాంకు లలో జమ చేస్తే రైతు బ్యాంకుల ద్వారా తీసుకునే అప్పుకింద బ్యాంకర్లు అట్టి డబ్బుని జమ చేసు కునే అవకాశం ఉన్నందున బ్యాంకును ఇష్ట పడ టం లేదు. అందులో వడ్డీ అదనంగా పడు తుంది. ముఖ్యంగా పోస్ట్‌మ్యాన్లకు కూడా పని ఎక్కు వగా ఉండకపోవడం వల్ల తమ ఉద్యోగం పట్ల శ్రద్ధ కనబర్చలేకపోతున్నారు. ప్రభు త్వం వారికి అప్పగిస్తే న్యాయం చేకూరుతుంది.
స్వర్ణ, మహిళా రైతు గాజుల మొల్కాపురం, పెన్‌పహాడ్ మండలం
ప్రత్యేక జీఓను విడుదల చేయాలి
రైతుకి అందజేసే డబ్బుని బ్యాంకులలో జమ చేయాలనుకుంటే ప్రత్యేక జీఓను తీసు కురావాలి. దానిపై బ్యాంకర్లకు అవగాహన కల్పించాలి. అట్టి డబ్బుని పెట్టుబడికి ప్రభుత్వం ఇస్తున్నందున తాము తీసుకున్న రుణంలో బ్యాంకర్లు జమ చేసు కోకుండా ఉంటే బ్యాంకులే బాగుంటాయి. అం దుకు ప్రభుత్వం ఆలోచింపజే యాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.సురేంద్ర మోహ న్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఎంపిపి భూక్య పద్మ, జెడ్పిటీసి పిన్నాని కోటేశ్వరరావు, వైస్ ఎంపిపి మండలి కృష్ణ, జిల్లా వ్యవసా య అధికారిణి జ్యోతిర్మయి, ఆర్డీఓ మోహ న్‌రావు, సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపిటీసి బచ్చలకూరి రాంచంద్రయ్య, తహసీల్దార్ సురేష్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బడు గుల లింగయ్యయాదవ్ పాల్గొన్నారు.
                                                                                           పిన్నాని కోటేశ్వరరావు, రైతు (జెడ్పిటీసి) పెన్‌పహాడ్ మండలం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News