* రైతుల ధర్నాకు సిఎల్‌పి ఉపనేత, ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి మద్దతు * అధికారులు,మంత్రి ఈటెలతో మాట్లాడిన టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి సంజయ్
మనతెలంగాణ/జగిత్యాల:జగిత్యాల మండలం అం తర్గాం, తాటిపెల్లి,అంబారిపేట గ్రామాల పరిధిలో ము ందస్తు సమాచారం లేకుండా విద్యుత్ శాఖ అధికారు లు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని నిరసి స్తూ తాటిపెల్లి వద్ద జగిత్యాల నిజామాబాద్ ప్రధాన ర హదారిపై మంగళవారం రైతులు ఆందోళనకు దిగా రు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తం భించిపోయింది. విషయం తెలుసుకున్న సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి రైతుల ధర్నా వద్ద కు చేరుకుని తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ,ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రధాన కా ల్వకు రైతులు విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసుకుని నీటిని వాడుకుంటున్నారని,నీటిని వాడుకోకుండా ఉం డేందుకు విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరికాదన్నారు.ప్రభుత్వమే అధికారులతో స మావేశం నిర్వహించి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించిందని ఆరోపించారు.ఒకవేళ ప్రభుత్వానికి ఈ విషయంలో సంబంధం లేనట్లయితే వెంటనే స ంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఎస్‌ఆర్‌ఎస్‌పినుంచి అక్రమంగా 14 టిఎంసిల నీటిని మిడ్‌మానేరుకు తరలించి ఈ ప్రాంత రైతాంగానికి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నా రు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువులు, కుం టలు పూర్తిగా ఎండిపోగా వ్యవసాయ బావుల్లో భూగ ర్భజలాలు పూర్తిగాఅడుగంటిపోయి సాగునీటి కో సం రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతన్నల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సి ఉండగా విద్యుత్ సరఫరా నిలిపివేసి రైతన్నలను కష్టాలకు గురి చేయడం తగదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రధాన కాల్వకు విద్యుత్ మోటార్లు బిగించుకుని నీటిని వాడుకుంటున్నారని, ఎప్పుడూ లేనట్లు ఇప్పుడే కొత్తగా ఏర్పాటు చేసుకున్న ట్లు అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఇబ్బందులకు గురి చేయడం పట్ల ఆయన మండిపడ్డారు.
కోత లు లేకుండా 24గంటల కరెంట్ అందిస్తున్నామని చె ప్పుకుంటున్న ప్రభుత్వం,కరెంట్ కోతలకు పాల్పడ్డ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.రైతులు ధర్నా చేస్తున్న విషయం తె లుసుకున్న టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ స ంజయ్‌కుమార్ అక్కడికి చేరుకుని రైతులకు సంఘీభా వం తెలిపారు.విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఎస్‌ఇకి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌లకు ఫోన్ ద్వారా వివరించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రధాన కాల్వకు గత 30 సం వత్సరాలుగావిద్యుత్ మోటార్లు బిగించుకుని నీటిని వాడుకుంటున్నారని,విద్యుత్ మోటార్లు పెట్టుకుని కా ల్వనీటిని తోడేస్తున్నారని విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరికాదని ఆయన మంత్రికి, అధికారులకు వి వరించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి సమస్య తీ వ్ర రూపం దాల్చిందని, వరి నాట్ల సమయంలో విద్యు త్ సరఫరా నిలిపివేయడం వల్ల రైతాంగానికి తీరని అ న్యాయంజరుగుతుందన్నారు.వరద కాల్వ తూము ను ంచి కాల్వ ద్వారా అంతర్గాం చెరువు నింపి తాటిపెల్లిలోని పెద్దయ్య చెరువు,దమ్మయ్యకుంటను లిప్ట్ ద్వారా నింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతులకు సాగునీటి ఇబ్బ ందులు ఉండవద్దని రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పిని నింపేందుకు పనులు యుద్ధ ప్రాతిపదికన జరగుతున్నాయన్నారు. విద్యుత్ కోతలు లేకుండా 24 గ ంటల విద్యుత్‌ను అందిస్తోందన్నారు. కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్, టిఆర్‌ఎస్ నాయకులుపాల్గొన్నారు.