Home ఖమ్మం నగర సమీపంలో భారీ లూటీ

నగర సమీపంలో భారీ లూటీ

The fine was Rs.3.93 crore

కోట్ల జరిమానా తప్పించుకునే యత్నం                                                                                                            అధికారులకు లక్షల్లో లంచాలు                                                                                                                        దోచుకున్నది రూ.50 కోట్ల సంపద                                                                                                                    జరిమానా వేసింది రూ.3.93 కోట్లు                                                                                                                        అదీ ఎగొట్టే యత్నం 

కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద అదీ ఖమ్మం నగరానికి కూత వేటు దూరంలో ఉంది. ఆ సంపదపై కన్నేసిన కొందరు అక్రమంగా దోచుకునేందుకు కుట్ర పూని సునాయాసంగా రూ.50 కోట్ల సంపదను రాష్ట్ర సరిహద్దులు దాటించారు. అది గమనించిన కొందరు ఫిర్యాదు చేయ డంతో అధికారులు రూ.3.93 కోట్లకు జరిమానా విధించారు. అక్రమా ర్కులు అదీ సైతం ఎగొట్టేందుకు సంబంధిత అధికార యంత్రాంగానికి లక్షల రూపాయలు ఎర వేస్తున్నారు. మసిబూసి మారెడు కాయ చేసి అన్న చందంగా మొత్తం లూటీ నుంచి బయటపడేందుకు రాజమార్గాలు వెతుకు తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ అటవీ శాఖాధికారి చక్రం తిప్పుతుం డగా రాజకీయ నేతల అనుచరులు దీనిలో కనపడని భాగస్వాములుగా ఉన్నారు. సర్వే, రెవిన్యూ, అటవీశాఖాధికారులు, మైనింగ్ అధికారుల వ్యవ హారంపై మన తెలంగాణ ప్రత్యేక కథనం. 

మన తెలంగాణ/ ఖమ్మం : కోట్ల విలువైన ఖనిజంపై కన్నేసిన కొందరు రాచ మార్గంలోనే లూటీకి ప్రయత్నించి విఫలమై దోషులుగా నిలబడి ఇప్పుడు మరో తప్పు డు మార్గంలో పయనిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తు న్న సంఘటన ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లి పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే… అప్పటి ఖమ్మం అర్బన్ మం డల పరిధిలోని బల్లేపల్లి పంచాయతీ బాలపేటలో బైరటీస్ ఖనిజం నిక్షిప్తమై ఉంది. బైరటీస్ గనులను లీజుకు తీసుకునేందుకు రవి మినరల్స్ కార్పొరేషన్ అనే సంస్థ దరఖాస్తు చేసింది. సర్వే నెం.137, 138లలో 37.14 ఎకరాల భూ మి లీజు కొరకు దరఖాస్తు చేసింది. ఇందులో 26.03 ఎకరాలు అటవీ భూమి ఉండడంతో లీజుకు ఇచ్చేందుకు అప్ప టి అధికారులు నిరాకరించారు. చివరకు 11.11 ఎకరాలు భూమి లీజుకు ఇవ్వగా రామసుబ్బారెడ్డి, పోతుల నర్సింహారావు, జువ్వాజి నర్సింహారావు, కత్తి కుమారస్వామి అనే వ్యక్తులు లీజు అగ్రిమెంటు చేయించుకుని బైరటీస్ ఖనిజాన్ని వెలికితీసి తరలించడం ప్రారంభించారు.
తమ పరిధి దాటి: తమకు లీజుకు ఇచ్చిన భూ మి హద్దులు దాటి అటవీ శాఖ భూమిలో ఖనిజాన్ని వెలికితీయడం ప్రారంభించారు. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం కోట్లాది రూపాయల ఖనిజాన్ని అక్రమంగా వెలికితీశారు. ఈ అక్రమ తవ్వకాలపై కొందరు వ్యక్తులు ఫిర్యా దు చేయడంతో మైనింగ్, సర్వే, అటవీ, రెవిన్యూ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి విచారణ జరిపారు. వారికి కేటాయించిన భూమి హద్దులు దాటి సుమారు 73 మీటర్ల మేర అటవీ భూమిలో తవ్వకాలు జరిపినట్లు తే ల్చారు. ఈ అక్రమ తవ్వకాల్లో సుమారు 5,955 మెట్రిక్ ట న్నుల బైరటీస్ ఖనిజాన్ని తరలించారు. వీటి విలువ లెక్కగ ట్టి రూ.3.93 కోట్ల జరిమానా విధించారు. ఆ జరిమానా సైతం చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. 2018 మే 10న జరిమానా విధించగా అప్పటి నుంచి జరిమానా ఎగ్గొట్టేందుకు పక్కదారులు వెతుకుతున్నారు. దీనికి తోడు జరిమానా చెల్లించి తిరిగి సర్వే చేసి హ ద్దులు నిర్ణయించే వరకు ఎటువంటి తవ్వకాలు జరపవద్దని సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

జరిమానా తప్పించుకునేందుకు: రవి మినర ల్స్ కార్పొరేషన్ సంస్థలోని భాగస్వాములు ఈ భారీ జరిమానా నుండి తప్పించుకునేందుకు కొందరు అధికారులు అ ప్పటికే తమతో ఉన్న రాజకీయ నాయకుల అనుచరులైన వాటాదారులు (స్లిపింగ్ పార్టనర్స్)తో కలిసి ప్రణాళిక రూ పొందించారు. తాము తవ్వకాలు జరిపిన అటవీ భూముల్లోని గుంటలను పూడ్చి చదును చేశారు. తాము అటవీ భూముల్లో ఎటువంటి తవ్వకాలు జరపలేదని అప్పడు ని ర్వహించిన సర్వేలో హద్దులు తప్పుగా తేల్చడం వల్లే స మస్య వచ్చిందని నిరూపించేందుకు ప్రయత్నం మొదలు పెట్టారు. ఇందులో ఒక అటవీశాఖాధికారి కీలకంగా వ్యవహరిస్తూ చక్రం తిప్పుతున్నాడు.
చక్రం తిప్పే వ్యక్తి వాటాదారుల్లో ఒకరికి దగ్గరి బంధువు కావడం గమనార్హం. తిరిగి స ర్వే నిర్వహించి అటవీ శాఖ భూమిలో ఎటువంటి తవ్వకా లు జరపలేదని చూపేందుకు సంబంధిత శాఖల అధికారులను నయానో, భయానో ఒప్పించే ప్రయత్నం జరుగుతుం ది. ఇప్పుడు రీ సర్వే పేరుతో కోట్ల రూపాయల జరిమానా ను ఎగ్గొట్టేందుకు దొడ్డిదారిలోపనులు మొదలు పెట్టారు. కోట్లాది రూపాయల ఖనిజాన్ని దోచుకోవడమే గాక అధికారులు వేసినా జరిమానాను సైతం చెల్లించకుండా పలు అధికారులను లంచాలతో మభ్యపెడుతున్న ఈ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఎటువంటి లూటీలకు పాల్పడకుండా ప్రజా సంపదను కాపాడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.