Home జాతీయ వార్తలు యుపిలో తొలిదశ పోలింగ్ నేడే

యుపిలో తొలిదశ పోలింగ్ నేడే

73 స్థానాలు ..839 మంది అభ్యర్థులు

Pollలక్నో : ఉత్తరప్రదేశ్‌లో శనివారం తొలిదశ పోలిం గ్ జరుగుతుంది. తొలి విడత పోలింగ్‌లో భా గంగా రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో మొత్తం 73 నియోజకవర్గాలలో 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవల్సి ఉంది. ఐ దు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లో జరిగే బ్యాలెట్ యుద్ధం అసెంబ్లీ స్థానా లు, ప్రచారసరళి నేపథ్యంలో అత్యంత కీలకంగా మారాయి. తొలి దశ పోలింగ్‌లో మొత్తం 839 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు, ప్రత్యేకించి పెద్దనోట్ల రద్దు తరువాత ప్రజాభిప్రాయానికి ఈ తొలిదశ పోలింగ్ ఓ అగ్నిపరీక్షగా మారనుందని విశ్లేషకు లు పేర్కొన్నారు. రాహుల్, అఖిలేశ్ కాంబినేషన్ ఫలితం ఏమిటనేది కూడా వెల్లడి కానుంది. ఈ సారి అధికార సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, ఆర్ ఎల్‌డిలు మహాకూటమిగా జతకట్టి ఎన్నికల బరి లోకి దిగాయి. ఈ కూటమి, బిజెపి, బిఎస్‌పిలు తమ బలమేమిటో తేల్చుకునేందుకు సిద్ధపడ్డాయి. కొందరు పలుకుబడి గల ఇండిపెండెంట్లు కూడా తొలి విడత పోలింగ్‌లో రంగంలో నిలిచారు. దీని తో జయాపజయాలు ఏమిటనేది ఉత్కంఠగా మా రనుంది. మొత్తం 15 జిల్లాలో జరిగే తొలి దశ పోలింగ్‌తో ఉత్తరప్రదేశ్‌లో నెలరోజుల పోలింగ్ ఘట్టం ప్రారంభం అవుతుంది. తొలిదశ పోలిం గ్‌కు గురువారం సాయంత్రంతో ఎన్నికల ప్రచా రం ముగిసింది. ప్రశాంతంగా, సజావుగా ఎన్నిక ల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఒకటి రెండు చోట్ల ఘర్షణలు జరిగి ఒకరిద్దరు హతులు కావడంతో పరిస్థితి ఉద్రిక్తం గానే ఉందని వెల్లడైంది. మొత్తం 26,823 పోలిం గ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఓటర్లలో 1.17 కోట్ల మంది మహిళలు ఉన్నారు. దీనితో మహిళల మొగ్గు ఎటువైపు అనేది కీలకంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిని ప్రధాని మోడీ తన నియోజకవర్గంగా ఎంచుకోవడంతో ఇక్కడ ఎన్ని కల విజయానికి ప్రత్యేకించి ఆయన ఆధ్వర్యం లోనే వ్యూహరచన జరిగింది. ఎన్నికలలో తామే మీ తీసిపొయ్యేది లేదనే రీతిలో ఈసారి 1508 మంది హిజ్రాలు కూడా రంగంలో నిలిచారు.
ఎన్నికల పరీక్షలో ప్రముఖులు
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ నోయిడా స్థానం నుంచి బిజెపి తరఫున నిలిచారు. మధుర నుంచి సిఎల్‌పి నేత ప్రదీప్ మాధుర్‌తో బిజెపి అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మ తలపడుతున్నారు. కైరానా నుంచి బిజెపి ఎంపీ హకుమ్ సింగ్ కూతురు మృగాంక సింగ్ బరిలో ఉన్నారు. వివాదాస్పద బిజెపి ఎమ్మె ల్యేలు సంగీత్ సోమ్ సర్దాన్ నుంచి , సురేష్ రానా లు తానాభవన్ నుంచి తమ బలం పరీక్షించుకుం టున్నారు. రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు లక్ష్మీ కాంత్ వాజ్‌పేయి రాజ్‌కోట్ నుంచి , ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు రాహుల్ సింగ్ సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై సికందరాబాద్ నుంచి నిలిచారు. రాజస్థాన్ గవర్నర్ కళ్యాన్‌సింగ్ మనవ డు సందీప్ సింగ్ అట్రౌలీ నుంచి రంగంలో ఉన్నా రు. పశ్చిమ యుపిలో గత ఎన్నికలలో ఎస్‌పి, బిఎస్‌పిలకు చెరి 24 సీట్లు వచ్చాయి. ఇక అజి త్‌సింగ్ నాయకత్వంలోని ఆర్‌ఎల్‌డికి తొమ్మిది, కాంగ్రెస్‌కు ఐదు, బిజెపికి 11 సీట్లు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ఈ ప్రాంతంలో పూర్తి గా అన్ని సీట్లను దక్కించుకుంది. వేరే ఏ పార్టీ గెలవలేదు.
ముజఫర్‌నగర్‌లో నిఘా
తొలి విడత పోలింగ్ జరిగే అన్ని జిల్లాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఘర్షణలకు వీలు న్న ముజఫర్‌నగర్‌లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి డికె సింగ్ తెలిపారు.
ఆగ్రా సౌత్ నుంచి 26 మంది పోటీ
తొలి విడత పోలింగ్ జరిగే ఆగ్రా సౌత్ స్థానంలో అత్యధికం గా 26 మంది అభ్య ర్థులు రంగంలో ఉన్నా రు. ఇక ఓటర్ల పరంగా అతి పెద్ద నియోజ కవర్గం గా సాహీబాబాద్, చిన్న నియో జకవర్గం గా జాలేసర్ ఉన్నా యి.