Tuesday, March 21, 2023

నాలుగో దశ మిషన్ కాకతీయకు నిధులు మంజూరు

- Advertisement -

harish2

* భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతి నిధి :  సిద్దిపేట జిల్లాలో మిషన్ కాకతీయ పథకం నాలుగో దశ పనులకు నిధులు మంజూరైనట్టు మంత్రి హరీశ్‌రావు వెల్లడించా రు. జిల్లాలో మొత్తం 14 పనుల కు సంబంధించి రూ.3.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని దుబ్బాక, తొగుట, కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు మండలాల్లోని చెక్ డ్యామ్‌లు, కుంటలు నిర్మించడమే కాకుం డా వాటిని అభివృద్ధి చేయనున్న ట్టు తెలిపారు. చేర్యాల మండలం తాడూరు గ్రామంలో చెక్ డ్యామ్ నిర్మాణానికి రూ.8.02 లక్షలు, మద్దూరు మండలం గాగ్గిల్లాపూర్ చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ.33.85 లక్షలు, బైరాన్‌పల్లి గ్రామంలో గుడెపు కుంట నిర్మాణానికి రూ.17.67 లక్షలు, తొర్నాల అప్పలయా చెరువు అభివృద్ధికి రూ.17.05 లక్షలు, కొమురవెల్లి మండలం కిష్టంపేట బతుకమ్మ కుం ట అభివృద్ధికి రూ.16.29లక్షలు, తొగుట మండలం తుక్కాపూర్ గ్రా మంలో బండ కుంట అభివృద్ధికి రూ.30.78 లక్షలు కాన్గల్ దొంతరాళ్ల కుంటకు రూ.26.65లక్షలు, కార్నాల కుంటకు రూ.10.45లక్షలు, పర్వతకుంటకు రూ.22.72లక్షలు, గోవర్థనగిరి అంగీరావుకుంటకు రూ.21.75లక్షలు, ఎల్లారెడ్డిపేట తొపుకుంటకు రూ. 25.95లక్షలు, ఘన్‌పూర్ గ్రామంలోని ఏమిశెట్టి కుంటకు రూ.30.85 లక్షలు, బండారుపల్లి ఊరచెరువు అభివృద్ధికి రూ.28.50 లక్షలు మంజూరైనట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ పనులకు సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించనున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles