Home కరీంనగర్ నాటిన ప్రతి మొక్కను రక్షించాలి

నాటిన ప్రతి మొక్కను రక్షించాలి

Fourth release is to protect each plant in the greenhouse

హరితహారంపై శిక్షణ
మంత్రి ఈటల రాజేందర్

మనతెలంగాణ/కరీంనగర్‌: నాలుగవ విడుత హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల ద్వారా నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకంపై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రా ష్ట్రంలో గత మూడు విడుతలుగా హరితహారం కార్యక్ర మం నిర్వహించుకున్నామని, ఆ అనుభవాలతో వచ్చే నాలుగవ విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చే యుటకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. లక్షాలను నిర్ణయించుకుని మొక్కలు నాటుట ముఖ్యం కాదని, తక్కువ మొక్కలు నాటిన వంద శాతం రక్షించుకునే బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు. హరితహారంలో ఎక్కువ మొక్కలు నాటి వాటిని రక్షించుకోలేక నిధు లు వృథా కానివ్వవద్దని అన్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీలు పెంచి ఆ గ్రామానికి అవసరమైన మొక్కలను వారే పెంచుకోవాలని సూచించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వెయ్యి ఇం డ్లు గల గ్రామాల్లో లక్ష మొక్కలు, 500ఇండ్లు గల గ్రామా ల్లో 40వేల మొక్కలు, 500లోపు ఇండ్లు గల గ్రామాల్లో 20 వేల మొక్కలు నాటుటకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.నాలుగవ విడుత హరితహారంలో ప్రభుత్వ భూము లు, చెరువు కట్టల వెంబడి, కాలువ గట్ల వెంబడి, పంచాయతీరాజ్,ఆర్‌అండ్‌బి రోడ్లు, ఎస్సారెస్పీ కెనాల్‌లు,ప్రభు త్వ కార్యాలయాలు,పాఠశాలలు, సంస్థల్లో మొక్కలు నాటి ంచాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలో నాటిన మొక్కలను వందశాతం నీరు పోసి రక్షించే బాధ్యత సంబంధిత యాజమాన్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్ల వెంబడి, కాలువల వెంబడి నాటిన మొక్కలకు తప్పకుండా ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆ దేశించారు. ముందుగానే మొక్కలు నాటుటకు అనువైన స్థ లాలను గుర్తించి అందులో ఎన్ని మొక్కలు నాటవచ్చునో వాటిని నీరు పోసి సంరక్షణ బాధ్యతలకు సంబంధించిన కార్యచరణ ప్రణాళికలు తయారు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ, అధికారు ల ప్రత్యేక శ్రద్ధతో హరితహారం కార్యక్రమం వంద శాతం విజయవంతం అవుతుందనిఅన్నారు. ప్రతి ఇంటికి పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేసి వారు ఇండ్లలో నాటి రక్షించుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. అంటుకట్టిన పండ్లు, పూలమొక్కలను మాత్రమే సరఫరా చేయాలని, అవి తొందరగా ఫలాలను అందిస్తాయన్నారు. గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను రక్షించుకునే బాధ్యత గ్రామ సర్పంచ్, కార్యదర్శి తీసుకోవాలని అన్నారు. హరితహారంలో ప్రజలందరిని భాగస్వామ్యులను చేస్తే విజయవంతం అవుతుందన్నారు. హరితహారంలో మొక్కలు నాటుట శాస్త్రీయబద్ధంగా ఉండాలని అన్నారు. ప్రతిమొక్క నా టుటకు ముందు గుంతలో ఎర్రమట్టితో నింపి ఎరువును తప్పకుండా వేయాలని ఆదేశించారు. గ్రామాల్లో నాటిన ఈత, తాటి మొక్కలకు డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేయాలన్నారు. ఎస్సారెస్పీ కాలువల గట్లపైన గు బురు వేర్లు వచ్చే మొక్కలను మాత్రమే నాటాలని, చాలా లోతుకు వేర్లు మొక్కలు నాటకూడదని కాల్వలు దెబ్బతింటాయని అన్నారు.
పార్లమెంట్ సభ్యులు బోయినిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ అధికారులు సీరియస్‌గా హరితహారంలో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్‌రావు మా ట్లాడుతూ హరితహారం విజయవంతం అందరి బాధ్యత అని అన్నారు. శాసన సభ్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ నగరంలో కాండం ధృఢంగా ఉండి 20ఫీట్లు ఉండే పెద్ద మొక్కలను నాటాలన్నారు. ఈ స మావేశంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, మైనార్టీ కార్పొరేషన్ చై ర్మన్ అక్బర్ హుస్సేన్, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, డిఆర్‌ఓ ఆయేషా మస్రత్ ఖానం, డిఆర్డీఓ వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావు, జడ్పీటీసీలు, ఎంపిపిలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.