మనతెలంగాణ / కాగజ్‌నగర్ : కుమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్ ప్రాంతంలో దొంగనోట్ల ముఠా సంచరిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు కాగజ్ నగర్ డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు ముఠా సభ్యులు పట్టుకున్నట్లు తెలిపారు. ఆదివారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఆరుగురు నింధితులు గల ముఠా జిల్లాలోని కొన్ని ప్రాంతాలల్లో నకిలి నోట్లు చలామణి చేస్తుండగా పక్క సమాచారంతో వారిని పట్టుకొవడం జరిగిందన్నారు. విలాసవంతమైన జీవితం కోసం ఆరుగురు నిందితులు ఒక ముఠాగా ఏర్పడి 50దొంగనోట్లకు 50 అసలు నోట్లు (50కి50 రేషియా)గా చలామణి చేసేలా ఒప్పందంతో కంబ్లీ రమేష్, తాండూరి ఉషా రేపక నాగభూషణం ఆహ్వానం మేరకు ఆస్మాక ఖాన్,షేక్ సలావోద్దీన్ (సలీం)లు సయ్యాద్ రఫీక్‌లు నకిలీ నోట్లు 4,06,100తో కాగజ్‌నగర్ వచ్చి రమేష్, ఉషా, నాగభూషణంకు 1,72,300రూపాయలు ఇచ్చి మిగితా నకిలీ నోట్లతో ఆర్టీసీ బస్సులో అక్కడినుంచి వెళ్ళి పోయిన్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు రమేష్,ఉషా, నాగభూషణంలను రైల్వే స్టేషన్ ఏరియాలో, అస్మఖాన్, సలావోద్దీన్, రఫీక్‌లను ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద లభించిన మొత్తం నకిలీ నోట్ల విలువ 4,06,100రూపాయలు , ఆరు మోబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో డీఎస్పీ సాంబయ్య, సీఐలు వెంకటేశ్వర్లు, ప్రసాద్, ఎస్సైలు ప్రభాకర్‌రెడ్డి, మజీద్, పోలీసు సిబ్బంది ఉన్నారు.