మన తెలంగాణ/చౌటుప్పల్ : బంగారు తెలంగాణ సాధనలో భాగంగా గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని మునుగోడు శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఆరెగూడెంలో ఆ గ్రామ ఉప సర్పంచి పల్లె లింగస్వామి కుమారుల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్స వం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలనుద్ధేశించి మాట్లాడు తూ రానున్న నాలుగు నెలల్లో చౌటుప్పల్ మండలంలోని అని గ్రామాలకు మిషన్ భగీరథ పథకం కింద స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టిఆర్‌ఎస్ పార్టీదే అధికారమని స్పష్టం చేశారు. తెలంగాణ జాతిపిత కెసిఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాధించడానికి మనం ఎంతో దూరంలో లేమన్నారు. ఆశించిన స్వప్నం సాకారం కాబోతోందని తెలిపారు. ఇచ్చిన మా ట తప్పకుండా పరిపాలన చేస్తున్న ముఖ్యమం త్రి కెసిఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో జెడ్పిటిసి సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, శ్యామ్, పల్లె లింగస్వామి, రాజు, నరేష్, శివ, శ్రీను, యాదయ్య, ముత్యాలు, రాములు , సత్తయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పాలన
- Advertisement -
- Advertisement -