= ప్రభుత్వ ఏక పక్షనిర్ణయం మార్చుకోవాలి
= డిసిపి అధ్యక్షులు క్యామా మల్లేష్
మన తెలంగాణ/ ఇబ్రహీంపట్నం టౌన్ : తెలంగాణ ప్ర భుత్వం నగర పంచాయతీల పేరుతో గ్రామ పంచాయతీలను తీసివేసి నగర పంచాయితీలను చేస్తాననడం సరైన ప ద్దతికాదని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు క్యామ మ ల్లేష్ , రాష్ట్ర కార్యదర్శి రాంరెడ్డి , జిల్లా అధికార ప్రతినిథి మ ంఖాల దాసు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పా ండాల శంకరన్న , కిరన్‌కుమార్ గౌడ్‌లు సృష్టం చేశారు. సో మవారం నగర పంచాయతీలోని శేరిగూడలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అవుటర్‌రింగ్ లోపల ఉన్న గ్రా మా పంచాయతీలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామనడం సరైన నిర్ణయం కాదని హితవు పలికారు. దీనిపై ప్రభుత్వం గుడ్డి నిర్ణయం సమంజసం కాదని అన్నా రు. ఆయా గ్రామాలలో నేటికి జాతీయ ఉపాధి , వ్యవసా య పనులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని నగర పంచాయతీలుగా చేస్తే ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు డుడూ బసవన్నలేనని ఆరోపించారు. ఆదిబట్ల మున్సిపాలిటి కింద బొంగ్లూర్, రాందాస్‌పల్లి, ఎంపిపటేల్‌గూడ, కొంగరకలాన్ నగర పంచాయతీలను చేసి స్థానిక ఎమ్మెల్యే పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని తెలిపారు. నగర పంచాయితీపై జిల్లా కలెక్టర్, రాష్ట్ర చీప్ సెక్రటరీని కలిసి విన్నవిస్తామని వివరించారు.నగర పంచాయితీ ఏర్పాటు నిర్ణయం మానుకోకపోతే నాగార్జున సాగర్ రోడ్డును ఇతర పార్టీలతో కలిసి దిగ్భందనం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్, నగర పంచాయితీ అద్యక్షులు గంట శ్రీనివాస్‌రెడ్డి, కిషాన్‌సెల్ నాయకులు గుండ్ల వెంకట్‌రెడ్డి, మంగళ్‌పల్లి సర్పంచ్ కీలుకత్తి అశోక్‌గౌడ్ , రఘు , తదితరులు పాల్గొన్నారు.