Friday, March 31, 2023

జాతర వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం

- Advertisement -

red-table

మనతెలంగాణ/ఎన్‌జిఒస్ కాలనీ: మేడారం జాతర వసతుల కల్పన లో  రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఈగ మల్లేశం అన్నారు. గురువారం బాలసముద్రంలోని ఎన్‌టిఆర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ మేడారం జాతర గతంలో పోల్చుకున్నట్లయితే ప్రస్తుతం నడుస్తు న్న జాతర వ్యవహారం ప్రజలను దర్శనం చేయించే తల్లులను క్రమంగా వైఫల్యం చెందిందన్నారు. పూర్తిగా అధికారులను పక్కనబెట్టి రెవెన్యూ, పోలీసు దేవాదాయ, ఆరోగ్యశాఖల వారీగా వారి విధులను నిర్వహిం చకుండా శాఖల వారి సూచనలు పరిగణనలోకి తీసుకో కుండా కేవలం టిఆర్‌ఎస్ నాయకులు, ఎంపిలు, మంత్రులు, ఎంఎల్ ఎలు ప్రభుత్వం మాదే జాతర మాదే అనే అహంతోటి జాతర మీద పెత్తనం చెలాయించి పాసుల జారీలో కూడా 35 వేల పాసులు ప్రింట్ చేయించి గత 10 రోజుల నుంచి కేవలం టిఆర్‌ఎస్ పార్టీ వారికే ఇచ్చే విధంగా అధికా రులను హెచ్చరిస్తూ పంపిణీ చేస్తున్నారన్నారు. మంత్రి హరీష్‌రావు ఒక్కరే మూడు వేల పాస్‌లు తీసు కోవడం జరిగిందన్నారు. అదేవిధం గా మంత్రులు, ఎంపి, ఎంఎల్‌ఎలు ఒక్కొక్కరు రెండు వేల పాసులకు తక్కువ కాకుండా తీసుకున్నారన్నారు. ఈ పాసులను కేవలం టిఆర్‌ఎస్ పార్టీకి చెందినవారికే ఇవ్వడం జరిగిందన్నారు. ఈ జాతర టిఆర్‌ఎస్ పార్టీకి చెందినదేనా, గత జాతరకు ప్రభుత్వ నిధులు రూ.120 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం జాతరకు రూ.80 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రెండు పర్యాయలుగా రూ.200 కోట్లు వెచ్చించినప్పటికీ  శాశ్వత నిర్మాణాలు లేవన్నారు. రూ.200 కోట్లు అధికార పార్టీ నాయకులు, కాంట్రా క్టర్లు  నిధులను దుర్విని యో గం చేశారన్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి గత 30 సం వత్సరాల నుంచి తరలి విచ్చేస్తున్న అశేష భక్తజనం, అరకొర సౌకర్యాలతో ఇబ్బం ది పడుతున్నారన్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు మాజీ మేయర్ కక్కె సారయ్య, నాయకులు జిలుకర వీరస్వామి, మాజీ వక్స్‌బోర్డు చైర్మన్ బాబా ఖాదర్ అల, వడ్నాల నరేందర్, కర్మిళ్ల వెంకటే శ్వర్‌రావు, భాషబోయిన సంపత్ యాదవ్, బజ్జూరి వీరేశం, శ్యాంగౌడ్, వి.రవీందర్‌గుప్త, మాదాసి, బాబు, ప్రతాపరావులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News