Saturday, March 25, 2023

పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

- Advertisement -

opening

 *మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

మనతెలంగాణ/బోధన్: ప్రైవేట్ దవాఖానలు రోగులను పీడిస్తుంటే రాష్ట్ర ప్రభు త్వం పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద్ద వహించి దవాఖానలో అనేక సదుపాయాలు కల్పిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రంలో మంజూరైన ఆపరేషన్ థియేటర్‌ను శుక్రవా రం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసా య మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ వైద్యం పేద ప్రజలను పట్ట్టి పీడిస్తుందని ఖరీదైన వైద్యాన్ని చేయించుకునే స్థోమత లేని పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతి ప్రాంతాలలో అవసరాలను బట్టి 100 పడకల దవాఖానను ఏర్పాటు చేసిందన్నారు.అందుకు కావలసిన సౌకర్యాలను కల్పించి ప్రైవేట్ దవాఖానలకు దీటుగా ఆపరేషన్ థియేటర్‌లను  సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరం లేకపోయినా ప్రైవేట్ దవాఖానల లో వేలు, లక్షల రుపాయల ఫీజులను వసూలు చేసి మహిళలకు జరిగే సాధారణ కాన్పులను సైతం  అత్యవసరంగా శస్త్ర చికిత్సలు చేయించాలని చెబుతూ అధికంగా ఫీజులను వసూలు చేస్తున్నారన్నారు. వేల రూపాయలు డబ్బులు చెల్లించలేని నిరుపేద మహిళ గరిణులకు ప్రభుత్వ  దవాఖానల్లో శస్త్రచికిత్సలు చేసేందుకు ప్రభు త్వం వైద్యులను నియమించి, ఆపరేషన్ థియోటర్‌లను సైతం ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు చేయించుకున్న మహిళలకు ఆడబిడ్డ పుడితే 13 వేలు, మగబిడ్డ పుడితే 12వేలు ఇవ్వడంతో పాటు కెసిఆర్ కిట్‌లను సైతం అందజేస్తున్నామని మ ంత్రి ఆన్నారు. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహా రం అందిస్తున్నామన్నారు. వర్నిలో అపరేషన్ థియోటర్‌తోపాటు, రక్తనిధిని కూడా మంత్రి ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రోగుల శ్రేయస్సు కోసం 100 పడకల దవాఖానను రూ.17 కోట్లతో నిర్మించా మని, ఈ దవాఖాన ప్రారంభోత్సవానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి హాజరు కానున్నారని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News