Friday, February 3, 2023

కుల వృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

- Advertisement -

jsb

స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి

గణపురం : తెలంగాణ ప్ర భుత్వం కులవృత్తుల అభివృద్ధికి పెద్దపీట వే స్తూ అహర్నిశలు కృషిచేస్తుందని స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి అన్నారు. ఆదివారం మండలంలోని బుద్దారం గ్రామంలో 67 మంది లబ్దిదారులకు 67 యూనిట్లు గొర్రెలను అందించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకులు కులవృత్తులు చేసుకునే జీవించే వారిని పట్టించుకునే పరిస్థితులు లేవని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కులవృత్తులపై ఆధారపడి జీవించే వారిని అభివృద్ధి చేయాలన్న లక్షంతో ఎన్నో సం క్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని అ న్నారు. గొల్ల కురుములకు ఒక్కొక్కరికీ లక్షరూపాయల విలువ చేసే గొర్రెలను అందించడం జరుగుతుందన్నారు. మత్సకారులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ల క్షంతో చెరువులు, కుంటలలో ఉచితంగా కోట్ల రూపాయల విలువచేసే చేపపిల్లలను పెంచడం జరుగుతుందన్నారు. బంగారు తెలంగాణ సాధించాలంటే గ్రామాలలో కులవృత్తుల పైఆదారపడి జీవించే వారు ఆర్థికం గా అభివృద్ధి చెందాలన్న లక్షంతో ప్రభు త్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రభుత్వ మూడు సంవత్సరాల పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి వైపు పరుగెత్తుతుందన్నారు. భూపాలపల్లి నియో జకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలు పడానికి తాను అహర్నిశలు  కృషిచేస్తానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles