మన తెలంగాణ/భూపాలపల్లి ప్రతినిధి: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ములుగు నియోజకవర్గంలోని రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.23 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని 17 రోడ్లను ఈ నిధులతో అభివృద్ధి చేయబోతున్నామని మంత్రి తెలిపారు. వెంకటాపూర్ మండలంలోని బావ్‌సింగ్‌పల్లి నుంచి పెర్కపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.93 లక్షలు, పెర్కపల్లి నుంచి గోపయ్యపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.76.50 లక్షలు, పార్కలపల్లి నుంచి చిం తరుప్పలపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.2.45 కోట్లు, వెంకటాపూర్ నుంచి లింగాపూర్ రోడ్డు నిర్మాణం కోసం రూ.2.95 కోట్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. అదే విధంగా కొత్తగూడ మండలంలోని అందుగుల గూడెం నుంచి జిల్లా పరిషత్ రోడ్డు వరకు రూ.63 లక్షలు, రంగప్పగూడెం నుంచి పిడబ్లుడి రోడ్డు వరకు రూ.103 కోట్లు, వెంకమ్మగుంపు నుంచి పిడబ్లుడి రోడ్డు వరకు రూ.54.60 లక్షలు, కిష్ణాపూర్ నుంచి బక్కచింతలపల్లి రోడ్డు వరకు రూ.72 లక్షలు, మాసంపల్లి నుంచి జిల్లా పరిషత్ రోడ్డు వరకు రూ.50 లక్షలు, బొత్తవానిగూడెం నుంచి పిడబ్లుడి రోడ్డు వరకు రూ.59 లక్షలు, మామిడిగూడెం నుంచి కొత్తగడ్డ వరకు రూ.66 లక్ష లు, తిమ్మాపూర్ నుంచి ఆదిలక్ష్మిపూర్ వరకు రూ.2. 49 కోట్లు, కొత్తపల్లి నుంచి బోటిమీది తండా వరకు రూ.2.57 కోట్లు, చెరువు ముందు తండా నుంచి దొరవారివెంపల్లి వరకు రూ.3.56 కోట్లు, పెగడపల్లి నుంచి దుర్గారం వరకు రూ.80.50 లక్ష లు, అందుగుల గూడెం నుంచి మహాదేవునిగూడెం వరకు రూ. 96 లక్షలు, బోటిమీది తండా నుంచి వెలుబెల్లి వరకు రూ.91 లక్షలు మంజూరి చేసినట్లు మంత్రి తెలిపా రు. వెంటనే ఈ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.