Tuesday, March 21, 2023

వడ్డీ రాయితీని ప్రభుత్వమే భరించాలి

- Advertisement -

dharna*అఖిల పక్షం రైతు సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా
*వ్యవసాయ ట్రాక్టర్లతో మానవహారం
*గంటల మేర నిలిచిన ట్రాఫిక్

మనతెలంగాణ/హుజూర్‌నగర్: రైతులు పొందిన ధీర్ఘకాలిక రుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వమే భరించాలంటూ పలు రైతు సంఘాల నాయకులు సోమవారం డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా పలువురు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రాధమిక సహాకార సంఘాలలో రైతుల ధీర్ఘకాలిక రుణాలపై గత 35 సంవత్సరాలుగా 6శాతం వడ్డీ రాయితీని ప్రభుత్వాలు భరించాయని, గత సంవత్సరం న్నార కాలంగా రైతులు తీసుకున్న ధీర్ఘకాలికరుణాలైన ట్రాక్టర్‌లు, బర్లు, గొర్రెలు, వ్యవసాయమోటార్లు, బావులు, పైపులైన్లు తదితర అవసరాలకోసం సహాకార సంఘాలల్లో తీసుకున్న రుణాలకు 6శాతం వడ్డీ రాయితీని ప్రభుత్వమే భరించాలని అఖిలపక్ష రైతుసంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో ని ఇందిరా సెంటర్‌లో భారీదర్నా రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహంచారు.  అంతకుముందు పట్టణంలోని ప్రధాన రహదారిలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. రైతులు తమవ్యవసాయ ట్రాక్టర్లతో ఇందిరా సెంటర్‌కు చేరుకొని, ట్రాక్టర్లతో మానవహారంగా ఏర్పడి సుమారు మూడు గంట లపాటు పెద్దపెద్ద నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిం చారు.  దీనితో పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు, కోదాడ రోడ్డు, మట్ట పల్లి రోడ్లలో కీలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. పిఎసియస్ చైర్మన్ గిన్నెరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యరగాని నాగన్నగౌడ్, కట్టా గోపాల్‌రావు, కొండా రెడ్డి లింగారెడ్డి, రోషిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొప్పోజు సూర్యనా రయణ, మేకల నాగేశ్వరరావు, అట్లూరి హరిబాబు, ముస్కుల చంద్రా రెడ్డి, కం బాల శ్రీనివాస్, నిజామొద్దీన్, అజయ్, తన్నీరు మల్లిఖార్జున్, చిట్యాల అమర్‌నాద్‌రెడ్డి, మంగళగిరి కవిత, మర్ల శ్రీనివాస్ యాదవ్, చందర్ రావు, దుగ్గి బ్రహ్మం, నర్సయ్య, కొండలు, వాసుదేవరావు, మంజూనాయక్, జక్కుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News