*టి-మాస్ కార్యాలయంలో మాట్లాడుతున్న నాయకులు
సామాజిక ఐక్యవేదిక టి-మాస్ సమావేశాన్ని స్థా నిక టి -మాస్ కార్యాలయంలో గురువారం ఏ ర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో టి -మాస్ జిల్లా కన్వీనర్ కిషన్ మాట్లాడుతూ టి-మాస్ జిల్లా అన్ని ప్రాంతాల్లో సర్వేను నిర్వహించిందన్నారు.అనేక సమస్యలు దృష్టికి వచ్చాయన్నారు. షెక్ సాహెబ్‌పే ట్,కుమాన్‌పేట్, వైఎస్‌ఆర్ కాలనిలో స్మశాన వాటికలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులెదుర్కొంటున్నారన్నారు. దిలావర్‌పూర్ గ్రామంలో వా టర్ ట్యాంక్ నిర్మించారు.కానీ నిరుపయోగంగానే వాటర్ ట్యాంక్ ఉందన్నారు.నిర్మల్‌లోని వైఎస్‌ఆర్ కాలనిలో పిహెచ్‌సి లేక ప్రజలు అనారోగ్యంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యల దృష్ట టి-మాస్ కమిటి పోరాడుతుందని పేర్కొన్నారు.టి-మాస్ ప్రజల సమగ్రభివృద్దికి తోడ్పడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. దీనిని రాజకీయ కోణంలో చూడదని విజ్ఞప్తి చేశారన్నా రు.రాజకీయం,కులాలకు అతీతంగా టి-మాస్ ప్రజా సమస్యలపై సర్వేలు చేస్తూనే ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యలు గుర్తించి ప్ర జలకు సేవలందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టి-మస్ నాయకులు ఎస్‌ఎన్ రెడ్డి, న్యాతకాల ప్రసాద్, ఎస్‌కె.దాదేమియ, వై.సాయన్న, పి. రాజేశ్వర్,సట్టి సాయన్న,మహ్ముద్,దోర రామాగౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.