Home జాతీయ వార్తలు ‘గవర్నర్ల వ్యవస్థ నిర్వీర్యం అవుతోంది’

‘గవర్నర్ల వ్యవస్థ నిర్వీర్యం అవుతోంది’

jp

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో గవర్నర్ల వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. శనివారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై ఢిల్లీలో ఇండియా నెక్ట్ జాతీయ సదస్సు సమావేవం జరిగింది. ఈ సదస్సులో రాజ్యాంగ నిపుణులు సుభాష్ కశ్యప్, జయప్రకాశ్ నారాయణ, సిపిఐ నేత సురవరం సుదాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెపి మాట్లాడుతూ… నాబినేటెడ్ గవర్నర్లు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ రాజకీయ ప్రతినిధులుగా పని చేస్తున్నారని, ఇది గవర్నర్ వ్యవస్థకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. నామినేటెడ్ గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలన్నారు. నిజమైన ఫెడరల్ వ్యవస్త ఉండాలని, అధికార వికేంద్రీకరణ చేయాలన్నారు. గతంలో ఎన్టిఆర్, బ్యోతిబసు తదితరులు ఫెడరల్ వ్యవస్థ కోసం పోరాడారని ఆయన తెలిపారు.