Wednesday, March 22, 2023

కోడి పందేలపై హైకోర్టు ఆగ్రహం

- Advertisement -

court
హైదరాబాద్: కోర్టు ఆదేశాలు ఉన్నా ఎపిలో కోడి పందేలు జరగడంపై హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఎపి చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీలను ఎందుకు అపలేకపోయిందని కోర్టు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా ప్రతినిధులే కోడి పందేలను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించింది. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందేలపై ఎన్ని కేసులు నమోదయ్యాయని, ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారో పూర్తి వివరాలు కోర్టుకు అందజేయాలని ఎపి డిజిపి, చీఫ్ సెక్రటరీలను కోర్టు ఆదేశించింది. అయితే దీనిపై స్పందించిన ఎపి ప్రభుత్వ తరపు న్యాయవాది నాలుగు వారాల గడువు కావాలని కోరారు. అందుకు అనుమతించిన న్యాయమూర్తి కేసు విచారణను నాలుగు వారాలు వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News