Tuesday, March 21, 2023

హామీలు అమలు ఘనత ప్రభుత్వానిదే

- Advertisement -

trs

*అభివృద్ధిని చూసే పార్టీలో చేరికలు
*సూర్యాపేట జిల్లాలో భారీగా పార్టీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలు
*మంత్రి జగదీశ్‌రెడ్డి

మన తెలంగాణ/సూర్యాపేట: దేశ చరిత్రలోనే ఎన్నికలు హామీలను అమలు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్తు, ఎస్సీ కులా ల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో పట్టణంలో కొండపల్లి దిలీప్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో 7వ వార్డుకు నుండి కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశంకు చెందిన దాదాపు 250 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సాధ్యమన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను సైతం నెరవేరుస్తున్నారని వెల్లడించారు. గత పాలకులు 60 ఏళ్లుగా ప్రభుత్వాని ఏలి చేయని అభివృద్ధిని కేవలం నాలుగు సంవత్సరాల కాలంలో చేసి చూపిస్తున్నామని వివరించారు. దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని గుర్తు చేశారు. అని వర్గాల వెనకబడిన ప్రజలకు వారి అభివృద్ధి కొరకు నిధులను కేటాయిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కొన్ని రాష్ట్రాలు ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయని గుర్తు చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి చేసిన కృషి వెలకట్టలేనిదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, మార్కెట్ కమిటీ ఛైర్మన్ వై.వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ నాయకులు గండూరి ప్రకాశ్, గోదల రంగారెడ్డి, కోడి సైదులుయాదవ్, కరుణారెడ్డి, ఊట్కూరి సైదులు, పోలెబోయిన నర్సయ్యయాదవ్, రఫి, మార్కెట్ డైరెక్టర్ సల్మా తదితరులు పాల్గొన్నారు.
నూతన్‌కల్‌లో
రాజకీయాలకతీతంగా అభివృద్ధి దేశ భవిష్యత్తు తరగతిలో గదిలో నిర్మితమవుతుందని రాష్ట్ర విద్యుత్తు, ఎస్సీ కులాల అభివృద్ధి శా ఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నూతన్‌కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు తరగతుల గదుల భవనాన్ని ఆయన ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. మానవ జీవన వికాసానికి విద్య తోడ్పాటును అందిస్తుందని గుర్తు చేశారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు అంగన్‌వాడీలను ప్రభుత్వ పాఠశాలల్లో అనుసంధానం చేస్తామని తెలిపారు.
రాజకీయాలకతీతంగా
గ్రామాల అభివృద్ధి
రాజకీయాలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు విద్యుత్తు, ఎస్సీ కులాల అభివృద్ధి మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సాయిరాం ఫంక్షన్‌హాల్‌లో భారతీ య జనతాపార్టీకి చెందిన దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, పగిళ్ల వెంకట్‌రెడ్డిలతో పాటు ముదిరాజ్, హాలి యా దాసరి సంఘం నాయకులు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో చేరారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కిందన్నా రు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, చారకం టి పాపన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపిపి, జెడ్పిటీసి, సర్పంచ్, రవీందర్‌రావు, ఎస్ ఎ రజాక్, గుజ్జ యుగేందర్‌రావు, ప్రభాకర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles