Home Default పెరిగిన ద్రవ్యోల్బణం

పెరిగిన ద్రవ్యోల్బణం

  • ఆగస్టు నెలలో 3.36 శాతం నమోదు
  • జులైలో స్వల్పంగా పుంజుకున్న పారిశ్రామిక ఉత్పత్తి

Inflation

న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి స్వల్పంగా పుంజుకుంది. అయితే జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను)ని అమలు చేయడంతో తయారీ రంగం ఉత్పత్తి ఇప్పటికీ మందగమన స్థితిలోనే ఉంది.. ప్రొడక్షన్ నెట్‌వర్క్‌కు ఇది అంతరా యం కల్గిస్తూనే ఉంది. అదే సమయంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో పెరిగింది. ద్రవ్యోల్బణం గణాంకాలను చూస్తే వచ్చే త్రైమాసికాల్లో రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారంనాడు కేంద్ర గణాంకాల శాఖ(సిఎస్‌ఒ) ఈ గణాంకాలను విడుదల చేసింది. గనులు, విద్యుత్ రంగాల్లో ఉత్తమమైన పనితీరు వల్ల జులైలో ఐఐపి(పారిశ్రామి ఉత్పత్తి సూ చీ) 1.2 శాతంతో పుంజుకుంది. జూన్‌లో 0.1 శాతంతో పోలిస్తే ఈసారి ఐఐపి వృద్ధిని సాధించింది. అయితే 2016 జులైలో ఐఐపి 4.5 శాతంతో పోలిస్తే ప్రస్తుత రేటు దిగువ స్థాయిలోనే ఉంది. మరోవైపు మరోవైపు ఆహార ప దార్థాల ధరలు ప్రియం కావడంతో ఆగస్టులో రిటైల్ ద్ర వ్యోల్బణం 3.36 శాతంతో పెరిగింది. అంతకుముందు నెల జులైలో ఇది 2.36 శాతంగానే ఉంది. పరిశ్రమల ఉత్పత్తిని తెలిపే ఐఐపి(పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) వృద్ధి ఏప్రిల్ జులై కాలంలో 1.7 శాతం నమోదవగా, గత ఏడాది ఇదే సమయంలో ఈ సూచీ 6.5 శాతంగా ఉంది. జులైలో తయారీ రంగం 77 శాతానికి పైగా వృద్ధితో 0.1 శాతం వృద్ధిని చూపింది. గత ఏడాది ఇదే నెలలో ఇది 5.3 శాతంగా ఉంది. గనుల రంగం ఉత్పత్తి 0.9 శాతం నుంచి 4.8 శాతానికి, విద్యుత్ రంగం 2.1 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి వృద్ధి రేటు సంవత్సరం క్రితం 1 శాతానికి పడిపోయింది.