Home రాష్ట్ర వార్తలు మల్లన్నకు ఆటంకం…అభివృద్ధి నిరోధకమే

మల్లన్నకు ఆటంకం…అభివృద్ధి నిరోధకమే

harish-raoసంగారెడ్డి : అతి తక్కువ ముంపు, ఎక్కువ సాగు, ప్రయోజనాలు ఉన్న రాష్ట్రంలోనే ఏకైక ప్రాజెక్టు మల్లన్నసాగర్ ప్రాజెక్టు లని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్త యితే తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఐదు లక్షల ఎకరాలకు నీరు అందుతుందని తెలి పారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మంగళవారం రాత్రి మీడి యా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడా రు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకోవడమంటే పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందకుండా చేయడమే అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మా ణంలో భూ నిర్వాసితులకు జిఒ 123తో పాటు 2016 చట్టం ప్రకారం భూసేకరణ చేయాలని, బాధితులకు పరిహారంచెల్లించేందుకు ప్రభుత్వం సిద్దంగా వుందని తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ రెండు రోజుల్లో వెలువడుతుందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రంతో పాటు మెదక్ జిల్లా సస్యశ్యామలమవుతుందని అన్నారు. మెదక్ జిల్లా అనాధిగా అన్ని రంగాల్లో వెనుకబడి వుందని, అణచివేతకు, అన్యాయానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణాలో ఒక్క ఎకరానికి కూడా నీరివ్వకుండా పులిచింతల కోసం 14 గ్రామాలను ముంచిన ఘనత ఉత్తమ్‌కుమార్‌రెడ్డిదని, ఆంద్రప్రదేశ్‌లో పోలవరంలో ఏడు మండలాలను ముంచిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. 20 టిఎంసిల సామర్థం గల ఎల్లంపల్లి ప్రాజెక్టులో 21 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 25 టిఎంసిల సామర్థం గల మిడ్ మానేరులో 14 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, కానీ 50 టిఎంసిల సామర్థం గల మల్లన్నసాగర్ ప్రాజెక్టులో కేవలం 5గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతున్నాయని వివరించారు. ఎక్కువ సామర్థం, తక్కువ ముంపునకు గురిచేసే ఏకైక ప్రాజెక్టు రాష్ట్రంలోనే మల్లన్నసాగర్ ఒక్కటేనని చెప్పారు. అటువంటి ప్రాజెక్టును రాజకీయ లబ్ది కోసమే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే నిర్వాసితులకు జిఓ 123, 2013 చట్టం ప్రకారం ఏది ఇష్టమైతే దాని ప్రకారమే నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా వుందని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు కోసం మొత్తం 16,410 ఎకరాల భూ సేకరణ అవసరం కాగా, ఇందులో 6,934 ఎకరాల పట్టా భూములున్నాయని, ఇప్పటివరకు 1,600 ఎకరాలు సేకరించామని చెప్పారు. జివో 123 ప్రకారం ఇప్పటివరకు భూములు అప్పగించినవారు తిరిగివచ్చి మాకు 2013 చట్టం ప్రకారం చెల్లించాలని అడిగినా కూడా వారికి ఇప్పుడు చెల్లించిన దానికంటే తక్కువే వస్తుందని అన్నారు.ఈ సమావేశంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.