Home ఎడిటోరియల్ రాం-రహీం ఎన్నికల కటౌట్లు వద్దు

రాం-రహీం ఎన్నికల కటౌట్లు వద్దు

Triple-Talaqరాజ్యాంగం సుప్రీం

2003లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని ముందుకుతెచ్చి, రాజ్యం నిష్క్రియపట్ల విచారం వ్యక్తం చేస్తూ మత స్వేచ్ఛపేరుతో ఆ డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్న వారిని తప్పుపడుతూ, ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించేం దుకు“పార్లమెంటు ఇంకనూ చర్య తీసు కోవాల్సి ఉంది”అని వ్యాఖ్యానించింది. విద్యావంతులు, ఉదార ముస్లింలు సైతం ఈ అంశంపై మౌన ముద్ర దాల్చటం ఆశ్చర్యకరం! మతాచరణకు, వ్యక్తిగత చట్టానికి సంబంధం లేదు. రాజ్యాంగం అత్యున్నత మైందని ఎఐఎంపిఎల్‌బి గ్రహిం చాలి. న్యాయం కోరుతూ ఎవరైనా కోర్టును ఆశ్రయించి నపుడే అది దృశ్యంలోకి వస్తుంది. బాధితుడు/బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గూర్చి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరినప్పుడే చట్టం వర్తిస్తుంది.

ఫోన్ ద్వారా భర్త విడాకులిచ్చిన నలుగురు బిడ్డల తల్లి ఇష్రాత్ జహాన్ నిన్నటివరకు ఎవరో ఎవరికీ తెలియదు. నోటిమాట ద్వారా విడాకులివ్వటం తన ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నదన్న కారణంతో సుప్రీంకోర్టు తలుపు తట్టటంతో ఆమె నేడు మీడియా టిఆర్‌పి రేటింగ్స్ పెంచుతున్నది. నిరంకుశమైన ట్రిపుల్ తలాక్ (తలాక్ అని మూడుమార్లు ఉచ్ఛారణతో విడాకులు) రద్దును ఆమె కోరుతోంది. ఎన్‌డిఎ ప్రభుత్వం తన వైఖరిని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాఖ్ లింగ న్యాయం, మహిళల సమానత్వం, మర్యాదకు వ్యతిరేకం అనే కారణంతో అది దాన్ని వ్యతిరేకిస్తున్నది. దీన్ని నిషేధించి, కొత్తకోడ్ తయారు చేసి, ముస్లిం వ్యక్తిగత చట్టాలను (పర్సనల్ లా) సంస్కరించిన 22 ఇస్లామిక్ దేశాలను అది ఉదాహ రణగా ఇచ్చింది. సిరియా, ఇరాన్, టునీసియా, మొరాకో, సౌదీ అరేబియా, పాకిస్థాన్ వాటిలో ఉన్నాయి. ప్రభుత్వం ముస్లిం సముదాయంపై “యుద్ధం” చేస్తున్నదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు నిందిస్తున్నది. సుప్రీంకోర్టు మత స్వేచ్ఛను నిర్ణయించజాలదు లేదా సంస్కరించజాలదని, సాంఘిక సంస్కరణ పేరుతో అది వ్యక్తిగత చట్టాలను తిరగరాయ జాలదని అది కోర్టుకు చెప్పింది. భర్త నిర్ణయం తీసుకునే మెరుగైన స్థితిలో ఉంటాడు కాబట్టి ఇస్లాంలో ట్రిపుల్ తలాఖ్ అనుమతించ బడుతున్నది. ఒక బాధితురాలిని ఆమె తప్పు ఏమీ లేకపోయినా భర్త ఆమెను బాధల పాల్జేయవచ్చునా? వివాహాన్ని ఇంత దుర్మార్గంగా, నిరం కుశంగా రద్దుచేయటంపై అప్పీలు లేదా? వివాహ పవిత్రతను ఒక పట్వా తలకిందులు చేయగలదా? అది మానవహక్కుల ఉల్లంఘన తో సమానం కాదా? ఇష్రాత్ మనోభావాలెలా ఉన్నాయి. ఆమెకు వివాహ హక్కులు నిరాకరించాలా? షరియత్ చట్టం ఆమె వివా హాన్ని రద్దు చేయగలదా? వ్యక్తి హక్కులను మతాధికారులు కాల రాయగలరా? అంతకన్నా ముఖ్యంగా రాజ్యాంగంపై ముస్లిం పర్సనల్ లా ఆధిక్యం వహిస్తుందా? పౌరులందరికీ ఒకే చట్టం – కామన్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) ఉండేటట్లు చేయటానికి ఇది సమయం కాదా?

విషాదం ఏమంటే, సుప్రీంకోర్టు లీగల్ సమస్యలతో తలపడుతుంటే, మన రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు, ప్రత్యర్థులపై అల్పమైన పాయింట్లు పొందటానికి ఇష్రాత్ కేసును ఉపయోగించుకుంటున్నాయి. ముస్లిం వ్యక్తిగత చట్టాలను అలాగే ఉంచి, వాటిని శిరసావహించే విధంగా మైనారిటీలను అనుమతిం చాలా లేక ఉమ్మడి పౌరస్మృతిని ఆమోదించాలా అన్న విస్తృత సమస్య పరిష్కారం గురించి ఆలోచించే బదులు రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి కొరకు పట్టువిడవని డిమాండ్ చేస్తున్న బిజెపి దాన్ని బలంగా నొక్కి చెప్పటానికి ఇష్రాత్ కేసుపై ఇల్లెక్కి అరు స్తున్నది. కాంగ్రెస్ గడసాము చేస్తున్నది; “అటువంటి సమస్యలన్ని టినీ పరిష్కరించే సామర్థం మన రాజ్యాంగం, చట్టానికి ఉన్నాయి” అని అంటున్నది. వామపక్షాలు, మానవ హక్కుల ఉల్లంఘనకు ప్రతీ కగా ఇష్రాత్‌ను చూపుతున్నాయి. ములాయంసింగ్ తన భాగ స్వాముల విజ్ఞతతో ఏకీభవిస్తూ, ఎంతో ఆలోచనతో చేసిన నిర్ణయం గా ఫట్వాను సమర్థించారు. ఇప్పుడు అందరి చూపులు అత్యున్నత న్యాయస్థానంవైపు కేంద్రీకరించి ఉన్నాయి. అది ఆదర్శం నెలకొల్పుతుందా, కాలం చెల్లిన ముస్లిం వ్యక్తిగత చట్టాల్లో చిక్కుకున్న 21వ శతాబ్దపు ముస్లిం మహిళల శృంఖలాలు తెంచుతుందా? బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన “ఐచ్చిక ఉమ్మడి పౌరస్మృతి”ని వక్కాణిస్తుందా? ఒక్కసారి వెనక్కుచూస్తే, నిరంకుశమైన తలాఖ్ ఆదేశంనుంచి ముస్లిం మహిళలకు విముక్తి ప్రసాదించటానికి సుప్రీంకోర్టు గతంలో మూడుసార్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1985లో, సుప్రసిద్ధ షా బానో కేసులో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మా సనం ముస్లిం వ్యక్తిగత చట్టాన్ని తోసిపుచ్చింది. విడాకులు ఇచ్చిన ముస్లిం మహిళకు ఆమె భర్తనుంచి పోషణ చెల్లింపును ఆదేశించింది. ఆర్టికల్ 44 మృతప్రాయంగా ఉండటంపట్ల బాధను వ్యక్తం చేస్తూ, కోర్టు ఇలా పేర్కొన్నది ః “ఘర్షణాపూరిత భావజాలాలతో కూడిన చట్టాలపట్ల భిన్న విధేయతలను తొలగించటం ద్వారా ఉమ్మడి పౌరస్మృతి జాతీయ సమైక్యత లక్షానికి సహాయకారి అవు తుంది”.ఆర్టికల్ 44 ఇలా చెప్పింది: భారత భూభాగమంతటా పౌరు లందరికీ ఏకరీతి పౌరస్మృతి సాధించేందుకు రాజ్యం కృషి చేయాలి”.

ముస్లిం మతాధికారులు, ఊహించినట్లే ఆ తీర్పును వ్యతిరే కించారు. అప్పటిప్రధానమంత్రి రాజీవ్‌గాంధి ముస్లింల అభిమానం పొందటానికై ఆ తీర్పును తోసిపుచ్చే విధంగా పార్లమెంటు చేత కొత్త శాసనం ఆమోదింపచేశారు. అది ముస్లిం మహిళల (విడాకులపై హక్కుల పరిరక్షణ) చట్టం. విడాకులివ్వబడిన మహిళలకు పోషణ చెల్లించని ముస్లిం వ్యక్తిగత చట్టానికి అది మరింత బలం చేకూర్చింది. 2003లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ముందుకుతెచ్చి, రాజ్యం నిష్క్రియపట్ల విచారం వ్యక్తం చేస్తూ మత స్వేచ్ఛపేరుతో ఆ డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్న వారిని తప్పుపడుతూ, ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించేందుకు “పార్ల మెంటు ఇంకనూ చర్య తీసుకోవాల్సి ఉంది” అని వ్యాఖ్యానించింది. విద్యావంతులు, ఉదార ముస్లింలు సైతం ఈ అంశంపై మౌన ముద్ర దాల్చటం ఆశ్చర్యకరం! మతాచరణకు, వ్యక్తిగత చట్టానికి సంబంధం లేదు. రాజ్యాంగం అత్యున్నతమైందని ఎఐఎంపిఎల్‌బి గ్రహించాలి. న్యాయం కోరుతూ ఎవరైనా కోర్టును ఆశ్రయించినపుడే అది దృశ్యంలోకి వస్తుంది. బాధితుడు/బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గూర్చి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరినప్పుడే చట్టం వర్తిస్తుంది. ఇజంల అదనపు భారాన్ని వదిలించుకోవటంలో కోర్టు ఈ పర్యాయమైనా సఫలమవుతుందో లేదో చూడాలి. గోవాలో దీర్ఘ కాలంగా (పోర్చుగీసు పాలననాటినుంచీ)ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉంది. మైనారిటీ మహిళల శృంఖలాలు తెంచే, రాజ్యాం గం అత్యున్నతంగా ఉండే నిజమైన లౌకిక భారత్‌కు పునాదులు నిర్మించబడతాయా?

– పూనం ఐ కౌశిక్