Home మహబూబ్‌నగర్ మహిళా మణులకే రేషన్ షాపులు

మహిళా మణులకే రేషన్ షాపులు

woman-retion-dealar-image

డీలర్ల సమ్మెతో ప్రభుత్వం ఆలోచన
జూలై కోటా మహిళా సంఘాలతోనే పంపిణీ
ఇప్పటికే లిఫ్ట్ జరుగుతున్న బియ్యం
డిడిలు చెల్లించిన మహిళా సంఘాలు
ఈ పాస్‌పై శిక్షణ
సరుకుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం : జెసి వెంకట్రావ్
సమ్మె ఆగదంటున్న రేషన్ డీలర్లు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : మహిళా సంఘాలకే రేషన్ షాపులు ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. వచ్చే నెల నుంచి మహిళా సంఘాలే రేషన్ సరుకులు పంపిణీ చేస్తుండడంతో ఇది నిజమనే అభిప్రాయం బలపడుతోంది. రేషన్ డీలర్ల సమ్మెతో ప్రభుత్వ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. పేదలకు ఇబ్బందులు కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా నడిపించేందుకు అవసరమైన ఏర్పాట్లను  పూర్తి చేస్తున్నారు.గత కొద్ది రోజులుగా రేషన్ డీలర్లు తమకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం వారి డిమాండ్లకు అంగీకరించక పోవడంతో డీలర్లు నిరవధిక సమ్మెకు దిగారు. డిడిలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ డీలర్లు ససేమిరా అనడంతో ప్రభుత్వం డిడిలు చెల్లించని డీలర్లపై వేటు వేసంది. దీంతో నిత్యావసర సరుకులు పంపిణీని బాధ్యతను ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 804 రేషన్ షాపులు ఉన్నాయి. ఆహార భద్రతా కార్డులు 341776 ఉండగా, అంత్యోదయ కార్డులు 27997 ఉన్నాయి. అన్నపూర్ణ కార్డులు 270 ఉన్నా యి. ఈ కార్డులకు ప్రతినెల 8353.19 కిల్లోల బియ్యం పంపిణీ జరుగుతుండగా, జిల్లాలోని 115 హాష్టళ్లకు 17687 మంది విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథ కం కింద1389 పాఠశాలలకు కలిపి 391 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. డీలర్ల సమ్మెతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.సివిల్ సప్లయ్ శాఖ గత కొంతకాలంగా రేషన్ అక్రమాలకు చెక్ పెట్టందుకు దొంగ రేష్‌న కార్డులను ఏరివేయాలన్న లక్షంతో ఈ పాస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే డీలర్ల సమ్మెతో ఈ పాస్ యంత్రాలు కూడా వారి వద్దనే ఉండి పోయాయి.దీంతో ప్రభుత్వం మహిళా సంఘాలకు ప్రత్యేక శిక్షణ కల్పించి రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టబోతోంది. డీలర్ల సమ్మెకు ప్రభుత్వం అంగీకరించక పోవడంతో పాటు డీలర్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలకే రేషన్ సరుకుల పంపి ణీ బాధ్యతను అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మహిళా సం ఘాలకు ఈ రేషన్ షాపుల నిర్వహణతో కొంత కమీషన్ పాటు నిజాయితిగా రేషన్ ప్రజలకు పంపిణీ చేస్తారన్న భావనతో ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం జూలై నెలకు సంబందించిన డిడిలను మహిళా సంఘాలతోనే తీసుకొని బియ్యంను లిఫ్ట్ చేస్తోంది. గోదాముల నుంచి నేరుగా మహి ళా సంఘాల ఇళ్లకు, కార్యాలయాలకు చేర వేస్తున్నారు.ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏ ర్పాట్లపై కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాలైతే తమకు మే లనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.డీలర్ల సమ్మెతో మహిళా సంఘాలకు బియ్యం కోటా ఇస్తుండడంతో ఇప్పడు అసలు ఎన్ని కార్డులు ఉన్నాయన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పాస్ విధానం అమల్లో వచ్చినప్పటికీ కొందరు డీలర్లు దొంగ రేషన్ కార్డుదారుల వేలి ముద్రలు కూడా నకిలీవి వేసి బియ్యంను గతంలో స్వాహా చేసే వారనే విమర్శలు ఉన్నాయి.కొందరు డీలర్లు నిజాయితిగా పని చేసినప్పటికీ ఈ సమ్మెతో వారి ఉపాధి కోల్పోయే అవకాశాలు లేక పోలేదు

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం : జెసి వెంకట్రావ్
రేషన్ డీలర్లె సమ్మె చేస్తున్నప్పటికీ ప్రజలకు రేషన్ పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రావ్ మన తెలంగాణకు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర సివిల్ సప్లయ్ కమీషనర్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు మహిళా సంఘాల ద్వారానే డిడిలు తీసుకొని సరకులు లిప్ట్ చేస్తున్నామని ఆయన తెలిపారు.ప్రజా పంపిణీకి ఎటువంటి ఆటంకాలు ఎదురే కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

మాకు న్యాయం చేయాల్సిందే : శాంతికుమార్
మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు శాంతికుమార్ తెలిపారు. ఎంతో కాలంగా రేషన్ షాపుల మీద జీవనం చేస్తున్నామని, కాని కమీషన్ చాలా తక్కవు వచ్చినప్పటికీ సామాజిక సేవలో బాగంగా సరుకులు పంపిణీ చేస్తూ వచ్చామన్నారు. మాకు కనీస వేతనంగా 30 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. మాకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు.