Home పెద్దపల్లి చక చక కాళేశ్వరం

చక చక కాళేశ్వరం

pdp

సిఎం రాకతో పనులు వేగవంతం
క్షేత్రస్థాయిలో వేగం పెంచిన హరీష్‌రావు
జూన్‌లో రెండు పంపులు ప్రారంభం
మిడ్ మానేరుకు నిత్యం టిఎంసి సరఫరా
ధర్మారం: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చకచక సాగుతున్నాయి.గుండెకాయలాంటి మేడారం పం ప్‌హౌస్‌లో సిఎం రాకతో పనులు వేగవంతంగా నడుస్తున్నా యి.తెలంగాణ ప్రాంత అభివృద్ధి,రైతాంగం అవసరాలు, సాగు,తాగునీటిని దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్న కాళేశ్వ రం పనుల్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సాగిస్తుంది. ఈ ఖరీఫ్‌కు నీళ్ళివ్వాలనే ఆలోచనతో ముందుకు సాగుతుంది. గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వా రా మిడ్ మానేరుకు ప్రధానంగా నీరందించే 6,7,8 ప్యాకెజీల పనుల్ని సత్వరమే పూర్తి చేసేందుకు ఏజెన్సీలు, ఇంజనీరింగ్ అధికారులుపక్కా ప్రణాళికతో ముందుకెళ్త్తున్నారు. అరవ ప్యాకెజీ పరిధిలోని మేడారం భూగర్భంలో ఏర్పాటు చేస్తున్న ఏడు పంప్‌ల్లో రెండు నుంచి మూడు దాదాపు పూ ర్తి కావస్తున్నాయి.ప్రధానమైన ఈ పంప్‌హౌస్ నుంచి ని త్యం ఈ రెండు నుంచి మూడు పంపుల ద్వారా నిత్యం టి ఎంసి నీటిని తోడేందుకు పనులు చురుగా సాగుతున్నాయి. గత నెలలో మేడారంను సందర్శించిన సిఎం కెసిఆర్ సూచనల మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రెండు సార్లు క్షేత్ర స్థాయి ప్రదర్శన చేశారు. మాసం రోజుల వ్యవధిలోనే గవర్నర్,సిడబ్ల్యూసి బృందం,ఐఎఫ్‌ఎస్ అధికారుల బృందం సందర్శించగా,హరీష్‌రావు స్వయంగా పర్యవేక్షణ జరుపుతున్నారు.సిఎం రాకకు ముందు యాభై శాతం పనులు జరగగా నెలలోనే ఎనభై శాతంకు చేరుకున్నాయి. జూలై గడువుగా పెట్టుకున్నప్పటికి జూన్‌లోనే రెండు నుం చి మూడు పంప్‌ల ద్వారా నీటిని తోడేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 6వ ప్యాకెజీలోని మేడారం, 7వ ప్యాకెజీలోలని మల్లాపూర్, 8 ప్యాకెజీలోని లక్ష్మిపూర్ వద్ద మూడు షిప్ట్‌ల్లో పనులు సాగిస్తున్నారు. కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ పాక వెంకట్రాములు, ఇఇ నూనె శ్రీధర్ పర్యవేక్షణలో ఏజెన్సీలు చురుకుగా పను లు చేపడుతున్నాయి.అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కల్గిన పంప్‌లన్నిభూగర్భంకు చేరుకున్నాయి.వాటిని బిగించి ఎలక్ట్రానిక పరికారాలు అమర్చుతున్నారు. వేమునూర్ నుంచి మేడారంకు అండర్‌టన్నెల్ ద్వారా చేరుకున్న నీరు ఇక్కడి నుంచి మోటార్లు ఎత్తి మేడారం రిజర్వాయర్‌లోకి చేరుస్తాయి. అక్కడి నుంచి మల్లాపూర్ తదనంతరం లక్ష్మిపూర్ ద్వారా మిడ్ మానేరుకు చేరుస్తారు.ఎట్టి పరిస్థితుల్లోను అ నుకున్న సమయంలోగా నీటిని మిడ్ మానేరుకు తరలించే ందుకు మేడారం, మల్లాపూర్, లక్ష్మిపూర్‌లో పనులు యు ద్ద ప్రాతిపాదికన నిర్వహిస్తున్నారు.మరో నాలుగు మాసా ల్లో గోదావరి జలాలు మిడ్ మానేరుకు చేరేందుకు ప్రయత్నాలు శరవేగంగా జరుగుతుండడం విశేషం.