Home secunderabad కిడ్నాప్‌కు గురైన చిన్నారి ఆచూకీ లభ్యం

కిడ్నాప్‌కు గురైన చిన్నారి ఆచూకీ లభ్యం

Kidnap

 

సికింద్రాబాద్‌ :  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌కు గురైన బాలిక ఆచూకీ లభించింది. రైల్వేస్టేషన్‌ సమీపంలోనే చిన్నారిని కిడ్నాపర్‌ వదిలిపెట్టాడు. కిడ్నాపర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెళ్లూరు వెళ్లేందుకు సురేష్‌ అనే వ్యక్తి తన కుమార్తె స్వర్ణలత(2), కుమారుడు ప్రభాస్‌(5)తో కలిసి ఆదివారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. ట్రైన్‌ అందుబాటులో లేకపోవడంతో తన పిల్లలతో కలిసి ప్లాట్‌ఫారంపై నిద్రించాడు. ప్రొద్దున అతను నిద్రలేచి చూసేసరికి కూతురు కనిపించలేదు. ఆందోళనకు గురైన అతను.. చుట్టు పక్కల గాలించాడు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు బృందాలు స్టేషన్‌ చుట్టు పక్కల గాలించగా.. రైల్వేస్టేషన్‌ సమీపంలోనే బాలిక కనిపించింది. దీంతో, బాలిక తండ్రి సురేష్‌ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు కిడ్నాపర్‌ కోసం గాలిస్తున్నారు.

The Kidnap Child was Found