Home జగిత్యాల ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య

Suicide

 

జగిత్యాల : తమకు ప్రేమ పెళ్లి కాదేమోనని ఓ ప్రేమ జంట శనివారం మండల కేంద్రం శివారులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్‌ఐ రాజ ప్రమీల చెప్పిన వివరాల ప్రకారం రాజారాం తండాకు చెందిన ప్రేమికులు లకావత్ మహిపాల్(21), భూక్య శిరీష(18)లు గత 6, 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులతో పెళ్లి విషయం అడిగారని, అయితే మహిపాల్ కొంతకాలం ఆగితే చేసుకుంటానని చెప్పాడు. దీంతో శిరీష తల్లిదండ్రులు రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో 6నెలల క్రితం వరపూజ జరిపించారు.

దీంతో తమ పెళ్లి కాదమోనని జీవితం మీద విరక్తి చెంది శుక్రవారం హస్టల్‌కు వెళ్తున్నామని చెప్పి గ్రామ శివారులోని వేపచెట్టుకు ఒకే కరెంట్ వైరుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. శిరీష కోరుట్లలో డిగ్రీ చదువుతుండగా, మహిపాల్ కరీంనగర్‌లో డిగ్రీ చదువుతున్నాడు. దీంతో ఇరు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలానికి మెట్‌పల్లి సిఐ రవికుమార్ చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

The Love Couple committed Suicide