మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: జిల్లాలోని నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని, వాటి నిర్వహణ తీరుతెన్నులపై రెండు రోజుల పాటు మండలాల వారీగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తానని జి ల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి అన్నారు. సో మవారం సిద్దిపేట ఆర్‌డిఓ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారులతో నర్సరీల ని ర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించా రు. నర్సరీల నిర్వహణను అన్ని జిల్లాల కం టే సిద్దిపేట జిల్లా ఆలస్యంగా మొదలు పె ట్టామని తెలిపారు. ఈ విషయమై రోజుకు మూడుసార్లు బ్యాక్ ఫిల్లింగ్ చేయాలని సూ చించారు. నర్సరీలోని ఒక్క బెడ్‌లో వెయ్యి బ్యాగులు ఉండాలని సూచించారు. హరితహారంలో జిల్లా అధికారులతే ప్రధానమైన కీలక పాత్ర అని కలెక్టర్ దిశా నిర్దేశం చేశా రు. నర్సరీల పెంపకంపై ప్రత్యేక అధికారు లు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలోని 110 నర్సరీలలో ప్రతి నర్సరీలో ప్రతి అధికారి రెండు గంటల పా టు ఉండి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిం చి అధ్యయనం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. హరితహారంపై సిద్దిపేట జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించాలని నిర్ణయించిందని, దీని ప్రకారం అధికారులంతా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జెసీ పద్మాకర్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో వంద దరఖాస్తులు : సిద్దిపేట ఆర్‌డిఓ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి నిర్వహించిన ప్రజావాణి కా ర్యక్రమంలో వంద మంది వివిధ సమస్యలపై దరఖాస్తులను అందజేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి జి ల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకవాలని అన్నారు. వచ్చిన విజ్ఞపులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ చేయాలని, వాటిని పరిష్కరించేందు కు దృష్టిసారించాలని అన్నారు. పెండింగ్‌లో దరఖాస్తులను ఎప్పటికప్పు డు క్లియర్ చేయాలని ఆదేశించారు.
నర్సరీల నిర్వహణపై…ప్రత్యేక శద్ధవహించాలి
- Advertisement -
- Advertisement -