Home రాష్ట్ర వార్తలు 1న సంగారెడ్డిలో గర్జన

1న సంగారెడ్డిలో గర్జన

కార్యక్రమంలో పాల్గొననున్న రాహుల్
మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttamహైదరాబాద్: ‘తెలంగాణ ప్రజాగర్జన’ పేరుతో భారీ బహిరంగ సభను జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో నిర్వహించను న్నట్లు పిసిసి అధ్యక్షులు ఎ న్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ సభలో ఎఐసిసి ఉపాధ్య క్షులు రాహుల్‌గాంధీ పాల్గొంటారని తెలిపారు. గిట్టుబాటు ధరలు దక్కక ఆత్మహత్యలు చేసు కుంటున్న రైతుల సమస్యలతోపాటు, నిరుద్యోగు ల సమస్యల పరిష్కారం కోసం ప్రజాగర్జన సభ ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామ న్నారు. కొత్త భూసేకరణ చట్టంపై సుప్రీం కోర్టు లో కాంగ్రెస్ సవాల్ చేస్తుందన్నారు. గాంధీ భవన్‌లో గురువారం జరిగిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు. కెసిఆర్ మూడేళ్ల పరిపాలన ఆయన దళారీ తనానికి అద్దం పడు తోందన్నారు. అవినీతి, నియంత్వత్వం, అక్రమా లు, అహంకార ప్రవర్తన, గొప్పలు, అసత్యప్రచా రాలకు ‘టిఆర్‌ఎస్ ట్రేడ్ మార్క్’గా మారిందని ఉత్తం విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో టిఆర్‌ఎస్, బిజెపి ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, దీనికి గత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనే కారణమంటూ టిఆర్‌ఎస్ నేతలు నిసిగ్గుగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని, ప్రాణాలను తెగించి పోరాటం చేశారని, ఇప్పుడు వారిని పట్టించుకోడంలే దన్నారు.బిసిలకు కెసిఆర్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని, మైనార్టీ రిజర్వేషన్లపై కెసిఆర్‌కు చిత్తశుద్ది లేదన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల తాము మోసపోయామని అన్ని వర్గాలు భావిస్తున్నాయన్నారు. 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే టిఆర్‌ఎస్ నేతలు నిసిగ్గుగా రైతులను ఆదుకుంటున్న ప్రకటనలు చేస్తున్నారన్నారు. దళిత సిఎం, మూడు ఎకరాల భూ పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం తదితర వాగ్ధానాలు చేసిన సిఎం కెసిఆర్ ఆ మాటను తప్పారన్నారు. ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీనే అడ్డుకుంటుందని టిఆర్‌ఎస్ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ఈ అంశాలన్నింటిని తమ ప్రజాగర్జనలో ఎత్తిచూపుతామన్నారు. మీడియా సంస్థలను బెదిరిస్తున్నారని, తద్వారా మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ఎంఎల్‌ఎల పార్టీ ఫిరాయింపుల విషయంలో సిఎం కెసిఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినా గవర్నర్, స్పీకర్ పట్టించుకోవడం లేదన్నారు. బిజెపి కాంగ్రెస్ కాళ్లు పట్టుకుంటోంది: సిద్ధాంతాలు, విలువల గురించి మాట్లాడే బిజెపి నాయకులు కాంగ్రెస్ నేతల కాళ్లు ఎందుకు పట్టుకుంటున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఇతర పార్టీల నేతలను బిజెపి ప్రలోభాలకు గురిచేస్తోందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలు ఎవరూ బిజెపిలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. బిజెపిలో అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్‌లోకి వస్తామని తమతో మాట్లాడుతున్నారని ఉత్తం అన్నారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై జరిగిన దాడి అమానుషమని, దీనిపై స్పీకర్‌ను కలుస్తామన్నారు. ఎంఎల్‌ఎలకు కనీస ప్రొటోకాల్ పాటించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను మంత్రులు, తమ పార్టీ కార్యక్రమాలుగా మారుస్తున్నారని విమర్శించారు.
పిసిసి కార్యవర్గ సమావేశం: ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ పాల్గొననున్న “తెలంగాణ ప్రజాగర్జన” సభకు భారీగాజనసమీకరణ చేయాలని, హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వరకు భారీ ఎత్తున వాహన శ్రేణితో రాహుల్‌కు స్వాగతం పలికి, 45 కిలోమీటర్ల మేరకు వాహనాల ప్రదర్శన నిర్వహించాలని పిసిసి నిర్ణయించింది. గాంధీభవన్‌లో గురువారం పిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పిసిసి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సంరద్భంగా ప్రజాగర్జన కార్యక్రమంపై చర్చించారు. హైదరాబాద్ నగరాన్ని స్వాగత తోరణాలతో అలంకరించాలని, దారిపొడవునా పార్టీ జెండాలను ఏర్పాటు చేయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ సభకు ప్రతిపల్లె నుంచి పది మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా తరలించాలని సూచించారు. మహిళలు, నిరుద్యోగులు, భూసేకరణ బాధితులు, మిర్చి, ఇతర రైతులు రాహుల్‌గాంధీతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వివరించారు.