Home సూర్యాపేట చేసి చూపించాం

చేసి చూపించాం

minister

60 ఏండ్లలో లేనిది మూడున్నర ఏండ్లలో అభివృద్ధి

*ఉమ్మడి రాష్ట్రంలో జరగని అభివృద్ధి టిఆర్‌ఎస్ ప్రభుత్వంతో సాధ్యమైంది
*మేడిగడ్డ ప్రాజెక్టే తెలంగాణకు జీవనాధారం
*జిల్లాను అగ్రస్థానంలో
నిలిపేందుకు ప్రభుత్వం కృషి
*అభినందన సభలో
మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట : నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాను అభివృద్ధిలో అగ్ర స్థానంలో నిలుపుతానని రాష్ట్ర విద్యుత్ , ఎస్సీ కు లాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగ దీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సుమంగళి ఫంక్షన్‌హాల్‌లో జిల్లా అభివృద్ధికి అధిక నిధులు తీసుకువచ్చిన సందర్భంగా ఆహ్వాన సంఘం ఆ ధ్వర్యంలో మంత్రి జగదీష్‌రెడ్డికి అభినంద నసభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గత 60 ఏండ్లలో సూర్యాపేటలో జర గని అభివృద్ధి మూడున్నర ఏండ్ల కా లంలోనే చేసి చూపించా రన్నా రు.సూర్యాపేట కేంద్రం మిర్యాల గూడ, నల్గొండ ప్రాంతాల కంటే ముం దుగానే అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. శాంతిభద్రతలు అదుపులో లేనందునే అభివృద్ధి చెంద లేదని చెప్పారు. సమైఖ్య రాష్ట్రంలో మార్కెట్ రేట్లను నిర్ణయించే స్థానం సూర్యాపేట వర్తకం గొప్ప గా ఉండేదని కొనియాడారు. గత 40సంవ త్స రాలుగా సూర్యాపేట పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను తీర్చడానికి కృష్ణా జలాలను ఎఎంఆర్‌పి ద్వారా మూసీకి మళ్ళించి సూర్యాపేటకు తాగు నీరు అందించినట్లు గుర్తు చేశారు. మిషన్ భగీరథ పనులను జనవరి లోపే పూర్తి చేసి ప్రతిరోజు పేట వాసులకు సరిపోను కృష్ణా నీటిని అందజేస్తామని స్పష్టం చేశారు. రూ.200 కోట్ల నిధులతో గ్రా మాలు, తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు.మూడేళ్లలో రూ.22 కోట్లకు పైగా నిధులతో గ్రామాల్లో సిసి రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. సూర్యాపేటను కార్పొరేషన్ స్థాయికి తీసుకుపోవడమే లక్షంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. రెండు మిని ట్యాంక్‌బండ్‌ల నిర్మాణం చేపట్టడంతో పాటు అహ్లాదకరమైన పార్క్‌లు నిర్మించనున్నట్లు చెప్పారు. జిల్లాకు పూర్వ వైభవం తీసుకురావడానికి వ్యవసాయం అభివృద్ధి చెందే విధంగా రైతులకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రాంతాలకు 45రోజుల పాటు గతంలో నీటిని విడుదల చేసి 200చె రువులను నింపి రైతులకు సాగునీరు అందించినట్లు గుర్తు చేశారు. రూ.250కోట్ల నిధులతో కాలువ మరమ్మత్తులను పూర్తి చేయడానికి ప్రభుత్వం పూనుకున్నట్లు పేర్కొన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికి ముమ్మాటికి జీవ ధార అవుతుందని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించడమే సిఎం ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. అనంతరం సుమారు 80 సంఘాల నాయకులు,ప్రతినిధులు మంత్రిని ఘనంగా పూలమాలలతో సన్మానించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికప్రకాష్ అధ్య క్షతన జరిగిన ఈ అభినందన సభలో ఆహ్వానకమిటి కన్వీనర్ పెద్దిరెడ్డి గణేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ మీలా సత్యనారా యణ, అక్కిరాజు పాండు, గుణగంటి రాములు, కొల్లు మధుసూధన్‌రావు, యానాల యాదగిరిరెడ్డి, ఇరిగి కోటేశ్వరి, గాదె రమాదేవి, దుర్గం ప్రభాకర్, బ్రహ్మాండ్లపల్లి మురళీధర్, ఖలేద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.