Home సూర్యాపేట వేగవంతంగా మిషన్ భగీరథ పనులు : చైర్ పర్సన్

వేగవంతంగా మిషన్ భగీరథ పనులు : చైర్ పర్సన్

mam

కోదాడ పట్టణ ప్రజలకు 30 సంవత్సరాలు మంచినీటి ఎద్దడి లేకుండా ప్రణాళికలు సిద్ధం

మనతెలంగాణ/కోదాడ ః రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా రూ.70కోట్ల నిధులతో కోదాడ పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు మిషన్ భగీరథ పనులు వేగవంతం చేస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ వంటిపులి అనితనాగరాజు, కమిషనర్ అమరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ ఛాంబర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిషన్ భగీరథ కింద మంజూరైన 70 కోట్లరూపాయిలతో ఆరునెలల కాలంలో పూర్తిస్థాయిలో పనులు నిర్వహించి పట్టణ ప్రజలకు తాగునీరుఅందిస్తామని తెలిపారు. కోదాడపురపాలకసంఘ పరిధిలో ఉన్నా 30వార్డులలో 7 వాటర్‌ట్యాంక్ పాయింట్లను గుర్తించి ఇప్పటికే పనులు మొదలుపెట్టినటు, అంబేద్కర్ నగర్‌లో ఉన్నవాటర్ ట్యాంక్‌ద్వారా 13 లక్షల లీటర్లనీటిని, శ్రీరంగాపురం వాటర్‌ట్యాంక్‌ద్వారా 5 లక్షల లీటర్లనీటిని, లక్ష్మీపురంలోని ఇందిరమ్మనగర్ కాలనీ వాటర్‌ట్యాంక్ ద్వారా రెండున్నర లక్షల లీటర్ల నీటిని, కట్టకొమ్ముగూడెంరోడ్డులో బాబునగర్ కాలనీలో వాటర్ ట్యాంక్ ద్వారా రెండు లక్షల లీటర్లు, బాలాజీనగర్ వాటర్‌ట్యాంక్ ద్వారా 3 లక్షల లీటర్లు, రెడ్‌చిల్లీ పక్కన వాటర్‌ట్యాంక్ ద్వారా 8లక్షల లీటర్లు ప్రభుత్వ బాలుర పాఠశాలలోని వాటర్‌ట్యాంక్ ద్వారా 15 లక్షల లీటర్ల నీటిని ప్రజలకు సరఫరాచేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు వారుతెలిపారు. కోదాడలోని 30 వార్డులలో 16,540 ఇంటి ట్యాబ్‌కనక్షన్లకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించేందుకు 187 కిలో మీటర్ల డిస్ట్రిబ్యూటర్ పంపులైన్ పనులను చేపట్టినట్లు వారుతెలిపారు. పట్టణంలో 17 కిలోమీటర్ల మెయిన్‌లైన్‌ను గుర్తించి,13 కిలోమీటర్లపైన పైపు లైన్ తెప్పించడం జరిగిందని, సుమారు 6 కిలోమీటర్ల పైపులైన్‌లు పూర్తిఅయినట్లు తెలిపారు. ఈ ప్రణాళిక ద్వా రా కోదాడపట్టణానికి 30 సంవత్సరాలునీటిఎద్దడి ఏర్పడకుండా నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్‌భగీరధ ప్రాజెక్టు మేనేజర్ బి చిట్టిబాబు, డిపార్టుమెంటల్ జేఈ వినీల్‌కుమార్, కోదాడమున్సిపల్ వార్డుకౌన్సిలర్లు ఎస్‌కె నయీం, కలకొండ పద్మశ్రీనివాస్, కందరబోయిన నాగమణివేలాద్రి, అజ్మిత్‌షమ్మి, ఖాజాగౌడ్, మొండెం గురవమ్మసైదిబాబు, మున్సిపల్‌అధికారులు ఇన్‌ఛార్జి డీఈ సత్యరావు, ఏఈ వరుణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కోదాడపట్టణంలో మిషన్‌భగీరధపనులను చైర్‌పర్సన్, కమీషనర్, పాలకవర్గం, మిషన్‌భగీరధ అధికారులు పరిశీలించారు.