Thursday, April 25, 2024

‘నారప్ప’ వస్తున్నాడు

- Advertisement -
- Advertisement -

The movie 'Narappa' will be released on May 14

 

విక్టరీ వెంకటేష్,- దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘నారప్ప’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంకీ రైతుగా.. ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపించనున్నాడు. ఇక నారప్ప భార్య సుందరమ్మగా హీరోయిన్ ప్రియమణి నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘నారప్ప’ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. మే14న ‘నారప్ప’ చిత్రాన్ని థియేటర్‌లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రెండు కొత్త పోస్టర్లను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News