Home రాష్ట్ర వార్తలు కదులుతున్న బినామీల డొంక

కదులుతున్న బినామీల డొంక

prision

* పురుషోత్తమరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న ఎసిబి

మన తెలంగాణ/హైదరాబాద్: ఆదాయానికి మించిన కేసులో నిం దితుడైన హెచ్‌ఎండిఎ ప్లానింగ్ డై రెక్టర్ పురుషోత్తమరెడ్డి ఆస్తుల డొం క కదులుతోంది. నాంపల్లి ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మే రకు చంచల్‌గూడ జైలులో రిమాం డ్‌లో ఉన్న పురుషోత్తమరెడ్డిని ఎసి బి అధికారులు శుక్రవారం కస్టడీ లోకి తీసుకున్నారు. ఎసిబి ప్రధాన కార్యాలయంలో అతన్ని ఉన్నతాధి కారులు విచారిస్తున్నారు. తొలిరో జు విచార ణలోనే బినామీ పేర్లపై ఉన్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చా యనే విషయం పై సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. ఏడేళ్ల క్రితం ఎసిబి అధికారు లకు పట్టుబడినప్పుడు ఆస్తులను తన పేరుపై కాకుండా బినామీల పేర్లపై కూడబెట్టిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు తాజాగా పట్టుబడినప్పుడు ఇంట్లో కేవలం రూ.5 కోట్ల ఆస్తులే లభ్యం కావడంపై ఆరా తీసినట్లు తెలిసింది. మరికొందరి బినామీల పేర్లను బయటికి లాగినట్లు తెలిసింది. మొదటి గంటపాటు ఎసిబి అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు పురుషోత్తమరెడ్డి నోరు విప్పకపోయినా బినా మీల పేర్లపై ఉన్న భవనాలు, భూములు, బంగారం, వజ్రాలకు సంబం ధించిన రసీదులు చూపించడంతో కొన్ని విషయాలను వెల్లడించినట్లు పోలీసుల ద్వారా తెలిసింది. ఈ విచారణ సందర్భంగా మరో రూ. 30 కోట్ల విలువైన ఆస్తులను ఎసిబి అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురు బినామీలను అరెస్టు చేసిన ఎసిబి అధికారులు మరి కొందరు బినామీలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరో ఐదు రోజుల పాటు విచారణ కొనసాగనుంది.