మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్డు విస్తరణకు సంబందించి కూల్చివేతలపై స్థానికులు అధికారులపై అగ్ర హం వ్యక్తం చేస్తూ పనుల నిలిపివేతకు డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా శుక్రవారం స్థానిక ముస్తాబాద్ చౌరస్తా వద్ద మునిసిపల్ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఆకస్మాత్తుగా మునిసిపల్ అధికారులు వచ్చి తమకు ఎలాంటీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గతంలో తాము విస్తరణకు సంబందించి మార్కింగ్‌లు చేసామని అధికారులు వివరించే ప్రయత్నం చేయగా స్థానికలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు సార్లు రెండు వేరు వేరుగా మార్కింగ్‌లు చేయడం వల్ల స్థానికులు ఆయోమయానికి గురవుతున్నారని, విస్తరణకు సంబందించి ఎలాంటీ వివరాలు చెప్పకుండా హఠాత్తుగా ఎలా కూలుస్తారని వారు ప్రశ్నించారు. మెదక్ రోడ్డును 50 ఫీట్ల మేర విస్తరిస్తామని అధికారులు వివరించగా తమకు గతంలో 44 ఫీట్ల మేర మాత్రమే విస్తరిస్తామని చెప్పి మల్లీ మాట మార్చడం ఏమిటని ప్రశ్నించగా వారికి బిజెపి, కాంగ్రెస్ నాయకులు మద్ధతు నిలవడంతో కొంత సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్డు విస్తరణ విషయంలో నష్టపోతున్న వారికి నష్టపరిహారం చెల్లించాలని బిజెపి, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న చైర్మన్ రాజనర్సు, తహసీల్దారు పరమేశ్వర్, ఎసిపి రామేశ్వర్‌తో పాటు అధికారులు అక్కడికి చేరుకుని స్థానికులను చల్లబరచే ప్రయత్నం చేశారు. రోడ్డు విస్తరణ పేరిట అధికారుల చూల్చివేతలను బిజెపి కౌన్సిలర్లు దూది శ్రీకాంతరెడ్డి, బాసంగారి వెంకట్, కాంగ్రెస్ నాయకులు బొమ్మల యాదగిరి, పూజల హరికృష్ణ, వంగ రాంచంద్రారెడ్డితో పాటు పలువురు అధికారుల తీరును గర్హించారు. దాదాపు రెండు గంటలకు పైగా అధికారులు, స్థానికుల మధ్య వాగ్వివాదం నడిచింది. చివరకు శనివారం మునిసిపల్ కార్యాలయంలో రోడ్డు విస్తరణకు సంబంధించి స్థానికులతో సమావేశం నిర్వహించిన తరువాతనే కూల్చివేతలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.
రోడ్డు విస్తరణపై స్థానికుల అభ్యంతరం
- Advertisement -
- Advertisement -