Saturday, April 20, 2024

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : కల్వకుర్తి పట్టణంలోని టిఎస్‌యుటిఎఫ్ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు చిన్నయ్య మాట్లాడుతూ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ అనే ఒకే ఒక లక్షంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ భీమా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వ పోస్టల్ సంఘాలు అన్ని కలిసి దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో జాయింట్ ఫోరం ఫర పిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఐక్యవేదికగా రూపుదిద్దుకుందన్నారు.

దీంతో ఈ రంగాల ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాబాట పట్టాల్సి వచ్చిందని, అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకువచ్చిన సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు.అనంతరం స్టేట్ లెవెల్ జాయింట్ కన్వెన్షన్ రాష్ట్రస్థాయి ఐక్య సదస్సు చలో హైదరాబాద్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌యుటిఎఫ్ జిల్లా నాయకులు లింగమయ్య, నెహ్రూ ప్రసాద్, వెల్దండ, ఊర్కొండ మండలాల అధ్యక్షులు నాగభూషణం, రాములు, ప్రధాన బాధ్యులు టి. వెంకటయ్య, సి. కృష్ణయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News