మన తెలంగాణ/టేక్మాల్ : పాత పెన్షన్ విధానాన్ని కొ నసాగించకుండా ప్రత్యేక ఆందోళనకు దిగుతామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. ఆదివారం టేక్మాల్ మండలంలో జిల్లాస్థాయి మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాత పె న్షన్ విధానాన్ని కొనసాగించకుంటే ప్రత్యేక ఆందోళనల కు దిగుతామని హెచ్చరించారు. కార్పొరేటు కంపెనీలకు ఇచ్చే రాయితీల్లో కొద్దిగా తగ్గించి జిపిఎస్ విధానాన్ని కొ నసాగించవచ్చునని ఆయన సూచించారు. పాత పెన్షన్ వి ధానం అనేటువంటిది బిక్ష కాదు ఉద్యోగుల హక్కు అని ఆయన పునఃరుద్ఘటించారు. ఉద్యోగుల కన్నీటి ఉసురు ఊ రికే పోదని ఆయన అన్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కుందాం… సిపిఎస్ పుట్టుపుర్వోత్తరాలు మనకు తెలుసా, సిపిఎస్ వల్ల ఉద్యోగ సమాజానికి జరుగుతున్న నష్టాలు, ఓపిఎస్‌లో ఉన్న ప్రయోజనాలు, సిపిఎస్‌లో కోల్పోతున్న ప్రయోజనాలు, సిపిఎస్ రద్దు కేంద్రందా లేక రాష్ట్రందా, అసలు సిపిఎస్ రద్దు సాధ్యమేనా, సిపిఎస్ ఉద్యోగి మరణిస్తే ఆధారపడిన కు టుంబ పరిస్థితి ఏమిటి, సిపిఎస్ రద్దుకై ఉద్యమ కార్యచరణ ఏవిధంగా ఉండాలనే అంశాలను తెలుసుకోవాలన్నారు. మా ర్చి 4వ తేదీన హైదరాబాద్‌లో జరిగే మహాధర్నాకు జిపిఎఫ్ ఉద్యోగులు లక్ష 45వేల మంది తమ కుటుంబాలతో సహా హా జరు కావాలన్నారు. నిర్లక్షం వహిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన అన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్, ఉపాధ్యాయులు దేవరాజు, చరణ్‌సింగ్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి : ఎమ్మెల్సీ నాగేశ్వర్
- Advertisement -
- Advertisement -