Wednesday, March 22, 2023

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -

trs

*ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం:  ఎంఎల్‌ఎ గువ్వల బాల్‌రాజు

మనతెలంగాణ /అచ్చంపేట రూరల్ ః ముఖ్యమంత్రి కేసిఆర్ ఎన్నికల సభలో 5వేల డబల్‌బెడ్‌రూం ఇళ్లను పేదలకు నిర్మించి ఇస్తామని నియోజకవర్గం ప్రజ లకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని వాటిని నెరవేర్చుటకు పనిచే స్తున్నానని స్థానిక ఎమ్మెల్యే గువ్వలబాల్‌రాజు అన్నారు. శనివారం కేసిఆర్ జన్మ దినం సందర్బంగా హాజీపూర్ గ్రామంలో 50 డబల్ బెడ్ ఇండ్లకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజుమాట్లాడుతూ కారణ జన్ముడైన కేసిఆర్ వారసులుగా కేటిఆర్  హరిష్ రావు, కవితల  అడుగుజాడలలో తాను పయనించి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేస్తానని ఆయన అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలలో కొనసాగుతున్నానని సంక్షేమపథకాల అమలు , అంగన్‌వాడి పోస్టుల విషయంలో పూర్తి పారదక్షతతో నీతివంతమైన పాలనను కేసిఆర్ అంది స్తున్నారని అన్నారు. ఈప్రాంతానికి సాగునీరు అందించుటకు పుల్జాల వరకు ఆగిపోయిన కేఎల్‌ఐ ప్రధానకాలువను చంద్రసాగర్ చెరువు వరకు పొడి గించుటకు అనుమతులు మంజూరయ్యాయని ఏడాది తిరిగే లోపే సీఎం కేసిఆర్ కాల్వలకు పట్టణంలో బెడ్ రూం ఇళ్లకు భూమి పూజ చేయిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అచ్చంపేట 100 పడకల ఆసుపత్రి 50 పడకల మాత శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు, గిరిజనులకు డిగ్రికళాశాల బిసీ మైనార్టీలకు గురుకు లాలు లాంటి అభివృద్ది పనులను గుర్తించి టీఆర్‌ఎస్ పార్టీని బలపరుచాలని అన్నారు. హాజిపూర్‌లో అర్హులైన స్థానికులకే డబల్ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వడం లో ప్రాదానత్య ఇస్తామని అన్నారు. అభివృద్ది సంక్షేమ రెండింటిని ముందుకు తీసుకెళ్లడానికి మాజి మంత్రి వర్యులు పుట్టపాగ మహేంద్రనాథ్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తానన్నారు. అనంతరం ప్రజల సమక్షంలోనే ముఖ్య మంత్రి కెసిఆర్ 64వ జన్మధిన వేడుకలకు కేకు కట్ చేసి ఘనంగా నిర్వ హిం చారు. 12మెట్ల కళాకారుడు మొగులయ్యకు పూలమాల , శాలువాతో సన్మా నించి అతనికి రూ.లు 25వేల నగదు ను ఇచ్చి ఎమ్మెల్యే గువ్వలబాల్‌రాజు తన ఉదారత్వాన్ని చాటుకున్నారు. గత ప్రభుత్వాలు గిరిజనుల అరాద్య దైవం సంత్ సేవాలాల్ జయంతివేడుకలను  విస్మరించారని తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసిఆర్ అధికారికంగా నిధులు కేటాయించి జరుపుకోవడం  బంజారా బిడ్డలను గౌరవించుకోవడమే నన్నారు.  ఈకార్యక్రమంలో ఎంపిపి పర్వతాలు,  కరు ణాకర్‌రావు, మంజుల, వైఎస్ ఎంపిపి సేవ్యానాయక్, జడ్‌పిటీసి రామకృష్ణారెడ్డి, మాజి జడ్‌పిటీసి పోకల మనోహర్, నగరపంచాయతీ చైర్మెన్ తులసీరాం, వైస్ చైర్మెన్ బందం విశ్వేశ్వరనాథ్, సర్పంచులు విజయలక్ష్మి , నర్సింహ్మగౌడ్, సత్తయ్య, ఎంపిటీసిలు జ్యోతి, రామాచారి, రాంబాబు నాయక్, కౌన్సిలర్లు, టిఆర్‌ఎస్ మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News