Home జాతీయ వార్తలు పోలీసు కారు చోరీ

పోలీసు కారు చోరీ

BREAKINGగురుదాస్‌పూర్ : తుపాకీతో ఓ ఎస్‌పిని బెదిరించి, ఆ ఎస్‌పి కారును దుండగులు చోరీ చేశారు. ఈ సంఘటన పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ వద్ద జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లా ఎస్‌పి గురువారం రాత్రి కారులో వెళుతుండగా , జమ్మూ, పతన్‌కాట్ జాతీయ రహదారి వద్ద దుండగులు అడ్డుకున్నారు. అనంతరం తుపాకీతో ఎస్‌పిని బెదిరించి కారును చోరీ చేశారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. చోరీకి గురైన ఎస్‌పి కారు శుక్రవారం ఉదయం స్థానిక అటవీ ప్రాంతంలో లభ్యమైంది.