* కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
మన తెలంగాణ/సిద్దిపేట టౌన్ : మూడు నెలల్లో పాండవుల చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయాలని టూరిజం, ఇరిగేషన్ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆ దేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెరువు అభివృద్ధి పనులు మూడు నెలల్లోపు పూర్తి చేయకుంటే సహిం చేదిలేదని అధికారులను హెచ్చరించా రు. గజ్వెల్‌లోని పాండవుల చెరువు సుం దరీకరణ జిల్లాలో ఇతర చెరువుల పుణరుద్దరణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు టూరిజం శాఖకు చెందిన అధికారిపై కలెక్టర్ అసంతప్తి వ్యక్తం చేశారు. పనుల ఎస్టిమెషన్ చేయడానికే ఇం కా ఎంత సమయం కావాలని క్షేత్రస్థాయి పరిశీలనకు వేళ్లి ఈ వారంలో త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నిర్మాణ పనులు ప్రాంభించిన తర్వాత ప్రతి 5 రోజులకు ఒకసారి పనుల పురోగతిపై తనకు రిపోర్ట్ చేయాలని సూచించారు రాత్రిపగలు అని తేడా లెకుండా ఫ్లడ్‌లైట్స్ పెట్టుకొ ని పనులు పూర్తి చేయాలని సూచించారు. ఒక్కరోజు కూడా ప నులు ఆగకూడదని ఆదేశించారు. సిద్దిపేట మిని స్టేడియంలో ని స్మిమ్మింగ్ పూల్ నిర్వాహన తీరుపై క్రీడాశాఖాధికారి బాల య్య, మున్సిపల్ డిఈ లక్ష్మణ్ ఎఈ మహేష్‌లతో కలిసి స్వి మ్మింగ్ పూల్ నిర్వహణపై సమీక్షించారు. అందరు బాధ్యతా యుతంగా పనులు చేయాలని సూచించారు.
భూరికార్డుల పరిశీలన అయిదు రోజుల్లో పూర్తి చేస్తాం : జిల్లా లో భూ రికార్డుల ప్రక్షాలన 5 రోజుల్లో పుర్తి చేస్తామని జిల్లా క లెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. గురువారం హైద్రాబాద్ సచి వాలయం నుండి సిసిఎల్‌ఎ రాజేష్ తివారి జిల్లా కలెక్టర్‌లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లోనె భూ పట్టాదారు పాసుపుస్తకాలను ప్రింట్ చేస్తున్నారని ఎలాంటి తప్పులు జరుగకుండా చర్యలు తీసు కుంటున్నట్లు తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకం ఆధార్ కా ర్డు నంబరును త్వరగా ఆధార్ లింక్ చేయాలని, దాంతో త్వ రలోనె ఫోటోతో పాటు పాస్ పుస్తకాలు తీసుకొవచ్చిని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకం జారి చేసేందుకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జెసి పద్మాకర్, గడా అధికారి హన్మంతరావు, డిఆర్వో చంద్రశేఖర్, ఆర్డిఒ ముత్యం రెడ్డి, తహసీల్దార్‌లు పాల్గొన్నారు.